ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.46
సూర్యాస్తమయం: సాయంత్రం.6.55
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: మ.12.05 ల12.20
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12
రా.10.46 ల11.36
మేషం:
ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు కలసివస్తాయి.ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయం అందుతుంది.
ఆర్ధిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలు లోటు ఉండదు.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం:
ఈరోజు ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి.గృహ వాతావరణం కొంత చికాకులు తప్పవు.నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది.సంతాన విద్యా, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.వ్యాపారమున వ్యయప్రయాసలతో అధికమౌతాయి.
మిథునం:
ఈరోజు బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి.
కర్కాటకం:
ఈరోజు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది.ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు.ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు లాభిస్తాయి.ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహం:
ఈరోజు రావలసిన బకాయిలు సకాలంలో అందవు.ఖర్చు అధికంగా ఉంటుంది.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
ఋణ ప్రయత్నాలు కలసిరావు.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి.ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి.
కన్య:
ఈరోజు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.ఆత్మీయ్యుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది.నిరుద్యోగులకు శుభ వర్తమానాలు అందుతాయి.వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు.ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.
తుల:
ఈరోజు చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.బంధు మిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి.దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి.వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు.వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం:
ఈరోజు కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసొస్తాయి.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సంతానానికి నూతన విద్యావకాశములు లభిస్తాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:
ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది.
మకరం:
ఈరోజు ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు.భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వృత్తి, ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు.
కుంభం:
ఈరోజు పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు.ఆర్ధిక పరమైన అనుకూలత పెరుగుతుంది.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి.స్థిరాస్తి క్రయ విక్రయాల లాభిస్తాయి.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.వ్యాపార విషయంలో లాభాలు అందుతాయి.
ఒక మంచి శుభవార్త వింటారు.దీనివల్ల ఆనందంగా ఉంటారు.
మీరు పనిచేసే చోట మీకు విజయాలు అందుతాయి.