విదేశస్తులు చాలామంది జంతువులుగా మారాలని అనుకుంటారు ఈ వింత కోరిక ఎందుకు వారిలో పుడుతుందో అర్థం కాదు కానీ తమకి ఇష్టమైన జంతువు, జీవిలాగా మారడానికి అత్యంత పెయిన్ ఫుల్ సర్జరీలు కూడా చేయించుకుంటారు.ఇటీవల ఎరిక్ స్ప్రాగ్ అనే అమెరికన్ వ్యక్తి తన శరీరాన్ని పూర్తిగా మార్చుకుని బల్లి లాగా తయారయ్యాడు.“లిజార్డ్మ్యాన్” ( Lizardman ) అని ఈ వ్యక్తిని పిలుస్తున్నారు.ఆ పేరుకు తగినట్లే పదునైన పళ్లు, రెండు ముక్కలుగా కట్ చేయించుకున్న నాలుక కనిపిస్తాయి.
మొత్తం శరీరానికి ఆకుపచ్చ టాటూలు వేయించుకుని ఈ విచిత్ర రూపాన్ని సాధించాడు.సముద్రంలోనూ, భూమిపైనా ఉండే జంతువు అయిన గజిల్లా ( Godzilla ) అనే సినిమా రాక్షసుడి నుంచి స్ఫూర్తి పొంది ఈ మార్పులు చేసుకున్నాడు.
ఇటీవల జూన్ 28న, బ్రిటన్ టాక్ షో “దిస్ మార్నింగ్”లో ఆలీసన్ హమ్మండ్, డెర్మట్ ఓ లియరీ అనే యాంకర్లకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ ఇంటర్వ్యూలో, ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, చరిత్రలలో బల్లుల, సరీసృపాల ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు.1997లో నాలుకను రెండు ముక్కలుగా చేయించుకున్నాడు.ఈ విధమైన మార్పు చేసుకున్న మొదటి వ్యక్తులలో ఒకరిగా అతను అవతరించాడు.
ఆ నొప్పితో కూడిన శస్త్రచికిత్స గురించి గుర్తుచేస్తూ, లేజర్ నాలుకను కోస్తున్నప్పుడు దాని వాసన, రుచిని కూడా అనుభవించానని చెప్పాడు.వాపు ఎక్కువగా ఉండడం వల్ల మామూలుగా మాట్లాడటానికి, తినడానికి దాదాపు వారం రోజులు పట్టిందని కూడా చెప్పాడు.
బల్లి రూపాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎరిక్ తన తలపై, కళ్లపై టెఫ్లాన్ గడ్డలను ఇన్ప్లాంట్ చేయించుకున్నాడు.ఈ గడ్డలు బల్లి పొలుసుల లాగా కనిపిస్తాయి.ఈ శస్త్రచికిత్సలు చాలా నొప్పితో కూడుకున్నప్పటికీ, తన కళ కోసం బాధను భరించాడు ఎరిక్.పళ్లు పదునైన తర్వాత, ఎరిక్కు కొంచెం మాట సరిగ్గా రాకపోవడం ప్రారంభమైంది.
మళ్లీ సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడానికి స్పీచ్ థెరపిస్ట్ సహాయం తీసుకోవలసి వచ్చింది.ఎరిక్ బయటకు వెళ్లినప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించడం సహజం.
చాలా మంది అతని వైపు చూస్తూ, మరోసారి చూస్తూ ఆశ్చర్యపోతారు.తన రూపం వల్ల కొన్నిసార్లు ట్రాఫిక్ ప్రమాదాలు కూడా జరిగాయని ఎరిక్ ఒప్పుకున్నాడు.అయితే, ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని తెలిసి ఊరట చెందాడు.“లిజార్డ్మ్యాన్”గా మారడానికి ఎరిక్ చూపించిన అంకితభావం మరెవరూ చూపించలేరేమో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.