ఇదేందయ్యాఇది.. ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ బేబీ గొరిల్లా..

విమానాశ్రయలలో అప్పుడప్పుడు బంగారం, వెండి, వజ్రాలు ఇంకా మత్తు పదార్థాలు లాంటి వాటిని స్మగ్లింగ్( Smuggling ) చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాము.అయితే అప్పుడప్పుడు పాములు ఇంకా ఇతర జంతువులు సంబంధించి స్మగ్లింగ్ చేయడం కూడా అనేక మార్లు మనం గమనించే ఉంటాం.

 Endangered Baby Gorilla Rescued From Smuggling At Istanbul Airport Video Viral D-TeluguStop.com

ఈ నేపథ్యంలో మరోసారి వింత సంఘటన చోటుచేసుకుంది.ఇంతకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఇస్తాంబుల్ విమానాశ్రయంలో( Istanbul Airport ) అద్భుత సంఘటన చోటు చేసుకుంది.కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కార్గో షిప్‌మెంట్‌లో ఉన్న బేబీ గొరిల్లాను( Baby Gorilla ) కనుగొన్నారు.వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఈ గొరిల్లాను రక్షించి, సురక్షితంగా సంరక్షిస్తున్నారు.వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నైజీరియా నుంచి బ్యాంకాక్‌కు తరలిస్తున్న రవాణాను ట్రాక్ చేశారు.

అనుమానాస్పదమైన కార్గోను తనిఖీ చేయగా, అందులో బోనులో పెట్టిన గొరిల్లా శిశువు కనిపించింది.సరైన పత్రాలు లేకుండా అక్రమ రవాణా చేస్తుండగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

తనిఖీ అనంతరం రక్షించబడిన గొరిల్లా శిశువుకు వన్యప్రాణుల నిపుణుల సహకారంతో తగిన చికిత్స అందించారు.ఈ చర్య వన్యప్రాణుల రక్షణకు కీలకంగా నిలిచింది.ఈ ఘటన అక్రమ వన్యప్రాణుల రవాణాపై మరోసారి దృష్టిని మళ్లించింది.ఇక ఈ విషయంపై సదరు అధికారులు పూర్తి వివరాలను సేకరించేందుకు శ్రమిస్తున్నారు.ఇక ఈ విషయాన్ని గమనించిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఎన్నో స్మగ్లింగ్ కేసులు చూసాం కానీ.

ఇలాంటి వెరైటీ స్మగ్లింగ్ ను చూడలేని కొందరు కామెంట్ చేస్తుండగా.వన్యప్రాణులను కాపాడేందుకు మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube