టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
అందులో భాగంగానే చివరగా దేవర సినిమాతో( Devara ) ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ఖాతాలో వేసుకున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ మూవీ వార్ 2 లో( War 2 ) సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్.ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలలో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా రాంచరణ్ హీరో జునియర్ ఎన్టీఆర్లు చాలా గ్యాప్ తర్వాత కలిశారు.
ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దర్శకుడు బుచ్చిబాబు( Director Buchibabu ) తమన్ చరణ్, తారక్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి.
అయితే రీసెంట్‌గా అమెరికాలో రామ్ చరణ్ మూవీ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.దీనికి చరణ్, తమన్, బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు.
రిటర్న్ వస్తున్న క్రమంలోనే దుబాయిలో దిగారు.అక్కడే ఎన్టీఆర్‌ని కలిశారు.మరి తారక్ హాలీ డే కోసం వెళ్తున్నాడా? వేరే షూటింగ్ ఏమైనా ఉందా? అనేది తెలియదు.కానీ ఎన్టీఆర్ లుక్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.
ఎన్టీఆర్ కాస్త లుక్ చేంజ్ అవడంతో పాటు కాస్త సన్నగా కనిపించడంతో కొత్త మూవీ కోసం ట్రై చేస్తున్నారా లేక ఇప్పటికే కమిట్ అయిన సినిమాల కోసమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.కాగా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలుకానుంది.ఈలోపు వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకోనున్నారు ఎన్టీఆర్.మరి తారక్ సన్నబడింది నీల్ ప్రాజెక్ట్ కోసమేనా లేదా ఇంకేదైనా ఉందా అని తెలియాల్సి ఉంది.