చాల మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.ఇది వరకు అందరూ టీ పొడి యూజ్ చేసే వాళ్లం.
అయితే ఇప్పుడు చాలా మంది టీ బ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు.టీ తాగక టీ బ్యాగ్స్ ని డస్ట్ బిన్ లో పడేస్తాము.
అయితే ఇందులో ఆశ్చర్య పడేంత ఏముంది అని అనుకంటున్నారా.? కానీ ఓ మహిళ మాత్రం టీ బ్యాగ్స్ తో అద్భుతం చేసింది.వాడిన టీ బ్యాగ్స్ చెత్త డబ్బాలో పడేయకుండా ఏం చేసిందో ఒక్కసారి చూద్దమా…? అంతేకాదండి ఈ వార్తను చదివాకా మీరు కూడా టీ బ్యాగ్స్ ను పడేయరు.
ఒకసారి వాడిన టీ బ్యాగ్స్ ని డస్ట్ బిన్ లో పడేయకుండా వాటిని భూమిలో నాటండి.
వాటిని అలా భూమిలో నాటడం వలన ఎన్ని ప్రయోజనాలు జరుగుతాయో తెలుసా.? వాటిని అలా నాటడం వలన భూమి సారవంతంగా మారుతుంది.అంతేకాదు మీరు మీ ఇంటిలో ఎక్కడైనా ఏమైనా మొక్కలు పెట్టాలి అనుకున్నపుడు ఆ పరిసర ప్రాంతాలల్లో వాడి పడేసిన టీ బ్యాగులను పూడ్చి పెట్టండి.అలా చేయడం వలన నేలలో సారవంతమైన మొక్కలు ఏపుగా పెరగడానికి అవి దోహదపడతాయి.
అంతేకాక అలా చేయడం వలన మొక్కలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి.కాకపోతే మీరు నాటే టీ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా చూసుకోవాలి.
అంతేకాదండి టీ బ్యాగ్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.వీటిని ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్న వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయి.కంటి సమస్యలకు, ఎక్కడైనా కాలిన గాయాలపై కానీ టీ బ్యాగ్స్ ని కొద్దిసేపు ఉంచడం వలన ఆ నొప్పి నుండి రిలీఫ్ పొందవచ్చు.అంతేకాదు చెడు వాసన రాకుండా ఉండాలంటే ఆ ప్రదేశాలలో టీ బ్యాగ్స్ ని ఉంచండి.
అంతేకాదు ఉల్లిపాయను కోసినప్పుడు చేతులు వాసన వస్తాయి.ఆ వాసనను పోగొట్టుకోవాలి అంటే టీ బ్యాగ్స్ ని తీసుకోని వాటిని కొద్దిసేపు చేతిలో వేసుకొని రుద్ది చేతులను కడిగేయాలి.
ఇలా చేయడం వలన ఉల్లి వాసన పోతుంది.కాబట్టి మీలో ఎవరైనా టీ బ్యాగ్స్ ను ఉయోగించు కొనేవారు ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు.