పాల‌ల్లో ఇవి క‌లిపి తీసుకుంటే రోగాలు మీ ద‌రిదాపుల్లోకి కూడా రావు!

పౌష్టికాహారంతో నిండిన ఆహారాల్లో పాలు( Milk ) ఒక‌టి.దాదాపు అన్ని వ‌య‌సుల వారికి పాలు ఎంతో మేలు చేస్తాయి.

 If You Take These Together In Milk Diseases Will Not Come To You Details, Milk,-TeluguStop.com

పాలలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్‌, విట‌మిన్ డి, విటిమ‌న్ ఎ, విట‌మిన్ బి12, విట‌మిన్ బి2, ఓమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, కార్బోహైడ్రేట్లు ప్ర‌ధానంగా ఉంటాయి.అందువ‌ల్ల రోజుకు ఒక గ్లాస్ పాలు తాగితే బోలెడు ఆరోగ్య లాభాలు పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే పాలతో కలిపి తీసుకునేందుకు కొన్ని చక్కని మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల జోడింపులు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌ల్లో కుంకుమపువ్వు( Saffron ) క‌లిపి తీసుకోవ‌డం అత్యంత ఆరోగ్య‌క‌రం.గ‌ర్భ‌ణీలు మాత్ర‌మే కాదు ఎవ్వ‌రైనా కుంకుమపువ్వు పాల‌ను తాగొచ్చు.త‌ద్వారా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.జలుబు, దగ్గు వంటి రోగాలు ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

కుంకుమపువ్వు పాలు రక్తప్రసరణను మెరుగుపరచడంలో మరియు హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.

Telugu Badam, Cardamom, Dates, Tips, Latest, Milk, Milk Benefits, Saffron-Telugu

పాలు మ‌రియు యాల‌కుల‌( Cardamom ) కాంబినేష‌న్ కూడా ఆరోగ్యానికి మంచి ఎంపిక అవుతుంది.పాల‌ల్లో యాల‌కులు క‌లిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది.శరీరానికి తేజస్సు ల‌భిస్తుంది.

మంచి నిద్ర ప‌డుతుంది.మ‌రియు ఇమ్యూనిటీ సిస్ట‌మ్ కూడా స్ట్రోంగ్ గా మారుతుంది.

Telugu Badam, Cardamom, Dates, Tips, Latest, Milk, Milk Benefits, Saffron-Telugu

మెద‌డు చురుగ్గా ప‌ని చేయాల‌నుకుంటే పాల‌లో బాదం( Almonds ) క‌లిపి తీసుకోవాలి.ఇంట్లో త‌యారు చేసిన బాదం పొడిని లేదా నాన‌బెట్టి పొట్టు తొల‌గించిన బాదం గింజ‌ల‌ను పాల‌ల్లో క‌లిపి ప్ర‌తి రోజూ తాగితే ఆలోచ‌న శ‌క్తి, జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతాయి.బ్రెయిన్ షార్ప్ గా ప‌ని చేస్తుంది.

ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారు పాల‌ల్లో ఖ‌ర్జూరం( Dates ) నానబెట్టి తాగడం మంచిది.

ఖ‌ర్జూరం పాలు శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను మెరుగుప‌రిచి ర‌క్త‌హీన‌త‌ను త‌రిమి కొడ‌తాయి.పైగా ఖ‌ర్జూరం పాలు నిద్ర‌లేమికి చెక్ పెడ‌తాయి.

నీర‌సంగా ఉన్న‌ప్పుడు పాల‌ల్లో అర‌టి పండు క‌లిపి తీసుకోవాలి.త‌ద్వారా శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.నీర‌సం పరార్ అవుతుంది.అయితే రాత్రివేళ మాత్రం పాల‌ల్లో అర‌టి పండు క‌లిపి తీసుకోవ‌డం మంచి ఎంపిక కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube