పెళ్లంటే ఈవిడకు దోపిడీనే.. చూడ చక్కని రూపంతో రూ.1.25 కోట్లు స్వాహా!

“లూటీ వధువు”…( Looting Bride ) ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ? ఉత్తరాఖండ్‌కు( Uttarakhand ) చెందిన సీమా (నిక్కీ అని కూడా పిలుస్తారు) సరిగ్గా ఇదే పనిచేసింది.పెళ్లిని ఒక వ్యాపారంగా మార్చేసింది.

 Seema Agarwal Aka Nikki From Dehradun Uttarakhand Marriages Scam Details, Lootin-TeluguStop.com

తన చూడ చక్కని రూపంతో అమాయకపు మగవాళ్లను వలలో వేసుకుని, వారి దగ్గర నుంచి లక్షలు కొల్లగొట్టింది.పదేళ్లలో ఏకంగా రూ.1.25 కోట్లు సంపాదించింది.సీమా మొదటి ఆట 2013లో ఆగ్రాలో మొదలైంది.ఒక బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే అతని కుటుంబంపై కేసు పెట్టి, రాజీ పేరుతో రూ.75 లక్షలు లాగేసింది.

Telugu Dehradun, Luteri, Nikki, Scam, Seema, Uttarakhand-Latest News - Telugu

అక్కడితో ఆగలేదు ఈ “లూటీ క్వీన్”.2017లో గురుగ్రామ్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను టార్గెట్ చేసింది.ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి, విడిపోయేటప్పుడు రూ.10 లక్షలు గుంజేసింది.సీమా అలియాస్ నిక్కీ( Seema Alias Nikki ) మోసాలు ఇక్కడితో ఆగలేదు.2023లో జైపూర్‌లో ఒక బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది.పెళ్లైన కొద్ది రోజులకే రూ.36 లక్షల విలువైన నగలు, డబ్బుతో ఉడాయించింది.దీంతో బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది.

సీమా మోసాల చిట్టా విప్పడంతో పోలీసులే షాక్ అయ్యారు.

Telugu Dehradun, Luteri, Nikki, Scam, Seema, Uttarakhand-Latest News - Telugu

పెళ్లి చేసుకుని మోసం చేయడం సీమాకు ఒక అలవాటుగా మారింది.మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన పురుషులను టార్గెట్ చేసేది.వేర్వేరు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేది.

ఇలా సెటిల్‌మెంట్ల పేరుతో చాలా డబ్బు సంపాదించింది.చివరకు సీమా మోసాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

ఇప్పుడు అసలు విచారణ మొదలైంది.ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి.

ఈ లూటీ బ్రైడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఎలాంటి కిలేడీతో చాలా జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube