అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుంచే!

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Hero icon star Allu Arjun )ఇటీవల పుష్ప 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి దాదాపుగా 1600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.

 Allu Arjun Next Movie With Trivikram Exclusive Shooting Update By Producer Naga-TeluguStop.com

అయితే ఈ సినిమా సక్సెస్ అయ్యిందని సంతోషపడేలోపే అల్లు అర్జున్ కు ఆ సంతోషం కూడా లేకుండా పోయింది.సంధ్య థియేటర్( Sandhya theater ) ఘటన అల్లు అర్జున్ కు వరుస వివాదాలు తెచ్చిపెడుతోంది.

వరుసగా ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు అల్లు అర్జున్.దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు.

Telugu Allu Arjun, Alluarjun, Naga Vamsi, Tollywood, Trivikram-Movie

అసలు ఈ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది.ఇంకా ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియని అయోమయంలో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్.ఇలాంటి సమయంలో బన్నీ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )దర్శకత్వంలో ఉంటుందని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ గీత ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇటీవల నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.త్రివిక్రమ్ తో బన్నీ తీయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి.

Telugu Allu Arjun, Alluarjun, Naga Vamsi, Tollywood, Trivikram-Movie

రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా ఉండబోతోంది.దేశంలో ఎవ్వరూ చూడని ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నాము.భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని తీయబోతున్నామని అన్నారు.అయితే తాజాగా నిర్మాత నాగవంశీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ.అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మార్చ్ నెల నుంచి మొదలు కానుంది.మొదట హీరో లేని సీన్స్ షూట్ చేస్తారు.

అనంతరం బన్నీ జూన్ లో షూటింగ్ లో జాయిన్ అవుతాడు అని ఆయన తెలిపారు.దీంతో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇది అభిమానులకు ఒకింత సంతోషపెట్టే వార్త అయినప్పటికీ అభిమానులు మాత్రం ప్రస్తుతం సంధ్య థియేటర్ ఘటన గురించి చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube