తెలుగులో ఇప్పటి వరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండస్ట్రీ పరిధిని కూడా పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక 2025 సంవత్సరంలో చాలామంది స్టార్ హీరోలు తమ రంగం సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సంవత్సరంలో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ (Prabhas, NTR, Allu Arjun)లాంటి నటులు వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసి భారీ విజయాలను సాధిస్తున్నారు.2025వ సంవత్సరంలో మొదటగా రామ్ చరణ్ కి గేమ్ చేంజర్(game changer , Ram Charan) సినిమాతో భారీ సక్సెస్ లను సాధించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది.తద్వారా ఎంతటి కలెక్షన్స్ ని కొల్లగొట్టబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక రామ్ చరణ్ (Ram Charan)తర్వాత ప్రభాస్ (Prabhas)రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది.రాజాసాబ్(Rajasaheb) సినిమాతో ఆయన 2025 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక అన్ని కుదిరితే ఫౌజీ సినిమాని కూడా ఆ సంవత్సరం రిలీజ్ చేయాలనే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి మొత్తానికైతే శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేస్తే మాత్రం 2025లో ఆయన రెండు సినిమాలు రావడం పక్కా అంటూ తన అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ(Chiranjeevi, Venkatesh, Balakrishna) లాంటి సీనియర్ నటులు సైతం 2025 లో భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు…ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సైతం వీలైతే రెండు సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఏది ఏమైనా కూడా 2025 వ సంవత్సరంలో పాన్ ఇండియాలో భారీ విజయాలను సాధించి తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగబోతున్నట్టుగా తెలుస్తోంది…