చాలామంది వారి వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా చెవులో పేరుకుపోయిన గులిమిని తీసేందుకు కాటన్ బడ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు.మరి కొందరు అయితే పేపర్ చుట్టి, మరి కొందరు అయితే బట్టను పెట్టి, పిన్నీసులు లాంటివి ఉపయోగిస్తూ గులిమిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఇలా చేయడం చాలా ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా కాటన్ బడ్స్ ఉపయోగించడంలో చాలా జాగ్రత్తగా వహించాలని వారు పేర్కొంటున్నారు.
ఇందుకు గల కారణం కాటన్ బడ్స్ ఉపయోగించడం ఎక్కువగా ఉపయోగించడం వల్ల వినికిడి లోపం తలెత్తవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.ఇలా కేవలం వైద్యలు మాత్రమే కాకుండా కాటన్ బడ్ తయారు చేసే కంపెనీలు సైతం వాటిపై ప్రమాదకరం అని ముద్ర వేస్తారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఒక అధ్యయనంలో చెవులో ఉండే గులిమిని తొలగించేందుకు నిర్మాణం స్వతహాగా కలిగి ఉంటుందని తేలింది.కనుక మనం ప్రత్యేకంగా గులిమిని తొలగించుకోవాలని అవసరం లేదని , చెవిలు వాటంతటవే శుభ్రం చేసుకుంటాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేశారు.

ఇక కాటన్ బడ్స్ ద్వారా చెవులను శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తే లోపల ఉండే గులిమి కొద్ది మొత్తం మాత్రమే బయటకు వస్తుందని వారు తెలియజేస్తున్నారు.ఇలా ఇయర్ బర్డ్స్ గులిమి కి తాకడం వల్ల మరింత లోపలికి వెళ్లి తెనాలి కర్ణభేరి పై పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.ఇలా ఎక్కువ శాతం గులిమి కర్ణభేరి పై ఉండిపోతే సున్నితమైన కర్ణభేరి తరంగాలు అనుగుణంగా ప్రకంపనలు సృష్టించే సామర్థ్యం కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వల్ల త్వరగా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందుకొరకు చెవులు శుభ్రం చేసుకునేందుకు ఎలాంటి పరికరాలు, వస్తువులు ఉపయోగించవలసిన అవసరం లేదని పరిశోధకులు తెలుపుతున్నారు.కనుక చెవుల మీద ఎలాంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది.