ప్రస్తుతం అనేక దేశాలలో పెద్దపెద్ద కార్యక్రమాలలో డ్రోన్స్ షో( Drone Show ) చేయడం పొరపాటుగా మారిపోతుంది.వందల కొద్ది డ్రోన్స్ ఒకే చోట చేరి ఆకాశంలో కొత్త కొత్త ఆవిష్కరణలు సృష్టించడం మనం చూస్తూనే ఉన్నాం.
నెల క్రితం అమరావతిలో కూడా ఈ డ్రోన్ షో భారీ ఎత్తున జరిగి రికార్డులలో కూడా స్థానం సంపాదించుకుంది.ఇకపోతే, తాజాగా క్రిస్మస్ వేడుకల్లో( Christmas Celebrations ) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో( Florida ) నిర్వహించిన డ్రోన్ ప్రదర్శనలో అనుకోని సంఘటన జరిగింది.ప్రదర్శనలో పాల్గొన్న డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొని,
కిందకు పడిపోయి వేడుకను తిలకిస్తున్నవారిపై పడటంతో పలువురు గాయపడ్డారు.ఈ ఘటనలో ఓ ఏడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడగా, అతడి తల్లి సోషల్ మీడియాలో చిన్నారి ఫోటోలు షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది.డాక్టర్లు చిన్నారి గుండెకు శస్త్రచికిత్స అవసరమని తెలిపారు.
ప్రమాద సమయంలో డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాలను అక్కడి ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.ఈ ప్రదర్శనను స్కై ఎలిమెంట్స్ అనే సంస్థ, ఓర్లాండ్ సిటీ( Orlando City ) భాగస్వామ్యంతో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు విచారణ జరుగుతోందని వారు వెల్లడించారు.ఇక ఈ వీడియోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.టెక్నాలజీని ఉపయోగించుకోవడం మంచిది కానీ.ఇలా పొరపాటు జరుగుతే ప్రాణాలు కూడా పోతాయని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు మరి కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే చాలా మంచిదని కామెంట్ చేస్తున్నారు.