స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన ‘పుష్ప 2: ది రూల్’( Pushpa 2 The Rule ) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.సినిమా కథతో పాటు, పాటలు కూడా యూత్‌ను ఓ ఊపు ఊపుతున్నాయి.
ముఖ్యంగా “పీలింగ్స్” సాంగ్( Peelings Song ) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.శంకర్ బాబు, లక్ష్మీ దాస గాత్రంలో ఊర్రూతలూగిస్తున్న ఈ పాటకు ఓ ప్రొఫెసర్ స్టెప్పులేస్తే, ఆ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది!
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) మైక్రోబయాలజీ హెడ్ పార్వతి వేణు( Parvathi Venu ) తన విద్యార్థులతో కలిసి “పీలింగ్స్” పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు.
క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పే మేడమ్ ఒక్కసారిగా డ్యాన్స్ ఫ్లోర్‌పైకి దూకి స్టెప్పులేస్తే స్టూడెంట్స్ మంత్రముగ్ధులైపోయారు.ముదురు ఆకుపచ్చ చీరలో పార్వతి ఎనర్జీ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.మొదట విద్యార్థుల డ్యాన్స్ చూస్తూ ఉండిపోయిన ఆమె ఒక్కసారిగా పర్సు పక్కనపెట్టి ఫుల్ జోష్‌లో స్టెప్పులేశారు.“నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి వచ్చుండాయ్ పీలింగ్స్” అంటూ సాగే పాటకు ఆమె వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు కూడా “వావ్” అంటున్నారు.
“మా హెచ్ఓడీ మేడమ్ మమ్మల్ని మించి వైబ్రేషన్స్‌తో ఉన్నారు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో.క్షణాల్లో వైరల్ అయింది.ఏకంగా 8 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.ప్రొఫెసర్ డ్యాన్స్‌కు( Professor Dance ) నెటిజన్లు ఫిదా అయిపోయారు.ఆమె కాన్ఫిడెన్స్‌ను, స్టూడెంట్స్‌తో ఆమెకున్న బాండింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.“పీలింగ్స్” సాంగ్ ఇప్పుడు ప్రొఫెసర్ డ్యాన్స్‌తో మరింత పాపులర్ అయిపోయింది.
ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో ముంచెత్తుతున్నారు.“ఆమె కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవారో ఊహించుకుంటేనే నవ్వు వస్తోంది!” అని ఒకరు కామెంట్ చేయగా, “ఏమీ చెప్పకుండానే ఆమె మెయిన్ క్యారెక్టర్ అయిపోయారు” అని మరొకరు రాశారు.చాలామంది ఆమెను “కూలెస్ట్ హెచ్ఓడీ ఎవర్” అంటూ పొగిడారు.ఆమె క్లాసీ స్టైల్‌ను కూడా మెచ్చుకున్నారు.
కొందరు సరదాగా “ఆమె రీల్స్‌కి హెచ్ఓడీ అయి ఉంటారు” అని జోకులు వేయగా, మరికొందరు తమ ప్రొఫెసర్లు కూడా ఇలాగే సరదాగా, కలుపుగోలుగా ఉండాలని కోరుకున్నారు.టీచర్లు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, ఇలా కూడా స్ఫూర్తినింపగలరని ఈ వీడియో చాటుతోంది.
ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.