అల్లుఅర్జున్ పాటకు రోడ్డుపై బైకర్లు డ్యాన్స్.. వీడియో వైరల్

ఇప్పుడు రీల్స్ చేయడం అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది.సోషల్ మీడియాలో రకరకాల ట్రెండ్స్‌లో భాగంగా ఎన్నో వినూత్నమైన వీడియోలు చూస్తూ ఉంటాం.

 Bikers Dance On The Road To Allu Arjun's Song.. Video Goes Viral, Viral Dance,vi-TeluguStop.com

తాజాగా, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇద్దరు బైకర్లు చేసిన డ్యాన్స్ ఒకటే ఇప్పుడు వైరల్‌గా మారింది.ట్రాఫిక్ సిగ్నల్ (Traffic signal)వద్ద రెడ్ లైట్ పడటంతో ఆగిన ఇద్దరు బైకర్లు తమ బైకుల నుంచి దిగిపోయి “పుష్ప 2”(Puspa 2) సినిమాలోని “పీలింగ్స్”(Peelings) పాటకు రోడ్డుపై డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ సమయంలో అక్కడున్న ఇతర వాహనదారులు ఈ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు.ఏమాత్రం సిగ్గు లేకుండా, పూర్తి ఉత్సాహంతో చేసిన ఈ డ్యాన్స్‌ను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇటీవల విడుదలైన పుష్ప 2(Puspa2) సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా “పీలింగ్స్” పాట యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.ఈ పాట మధ్యలో వచ్చే మలయాళం లిరిక్స్‌కు రీల్స్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం చాలా మంది యువతలో ట్రెండ్‌గా మారింది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ (Allu Arjun, Sandhya Theater)వద్ద జరిగిన సంఘటన గురించి ప్రత్యేకంగా చేపలసిన పని లేదు.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇలా ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై చేయడం ఎంతవరకు సబబు అని కొందరు కామెంట్ చేస్తుండగా.డాన్స్ భలే చేశారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube