కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయులు తమ పిల్లలకు మాతృభాష నేర్పేందుకు గాను విదేశాల్లో నిర్వహిస్తున్న కన్నడ తరగతులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆదివారం బెంగళూరు సమీపంలోని మాండ్యలో 87వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనం చివరి రోజు జరిగిన సెషన్‌లో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
జర్మనీలో స్థిరపడిన రష్మీ నాగరాజు మాట్లాడుతూ.రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐలు తమ పిల్లలకు కన్నడ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వారాంతాల్లో తమ పిల్లలకు విదేశాల్లో ‘‘కలి- నాలి’’ పాఠ్యాంశాలను( “Kali-Nali” curriculum ) చెబుతున్నట్లు రష్మీ తెలిపారు.
జర్మన్ పాఠశాలల్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలతో పాటు హిందీని మూడవ భాషగా బోధించడానికి అనుమతులు ఉన్నాయని ఆమె వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం కనుక మా కన్నడ తరగతులకు అక్రిడిటేషన్ ఇస్తే అది అధికారికంగా పరిగణించినట్లు అవుతుందని రష్మీ నాగరాజ్ ( Rashmi Nagaraj )చెప్పారు.తద్వారా పాఠశాలల్లో కన్నడను మూడో భాషగా ప్రవేశపెట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయొచ్చని ఈ నిర్ణయం విదేశాల్లో కన్నడను సంరక్షించడానికి , అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ ( Kannada Development Authority )తగిన చర్యలు తీసుకోవాలని రష్మీ నాగరాజ్ విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో స్థిరపడిన శశిధర్ నాగరాజప్ప( Shasidhar Nagarajappa ) మాట్లాడారు.వివిధ దేశాలలో మొత్తం 5,866 మంది ఎన్ఆర్ఐల పిల్లలు కన్నడం నేర్చుకుంటున్నారని, 704 మంది ట్యూటర్లు కన్నడ బోధనలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు.ఖతార్‌లో స్థిరపడిన హెచ్ కే మధు విదేశాల్లో కన్నడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపారు.
కార్మికులు ఉండే శిబిరాల్లో కనీస సౌకర్యాలు లేవని, వారికి నెలవారీ వేతనాలు చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.రెండేళ్లకు ఒకసారి స్వగ్రామాలకు రావాలని అనుకున్నా విమాన ఛార్జీలు చెల్లించలేకపోతున్నామని ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.