ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌లో స్నాక్స్ అమ్ముతున్న పాక్ అమ్మాయి.. వింటే దిమ్మతిరగాల్సిందే

పాకిస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన చిన్నారి షుమైలా (Shumaila) ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది! కారణం ఆమెకున్న అసాధారణ ప్రతిభ.వీడియో బ్లాగర్‌తో ఆమె అనర్గళంగా ఇంగ్లీష్‌లో (english)మాట్లాడిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

 Pakistani Girl Selling Snacks In Fluent English...it's Mind-blowing To Hear, Shu-TeluguStop.com

దీంతో షుమైలా పేరు మారుమోగిపోతోంది.

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్ అనే కుగ్రామంలో షుమైలా నివసిస్తోంది.

పేదరికం కారణంగా కుటుంబాన్ని పోషించడానికి వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటి చిరుతిళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.చదువుకోవడానికి కనీసం బడికి కూడా వెళ్లని షుమైలా ఏకంగా ఆరు భాషల్లో(six languages) అనర్గళంగా మాట్లాడటం విశేషం.

దీనికి కారణం 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఆమె తండ్రి.స్వయంగా ఇంట్లోనే ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించడమే! షుమైలా ప్రతిభకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన డాక్టర్ జీషన్ (Dr.Zeeshan)అనే వీడియో బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ ఓ వీడియోలో షుమైలా మాట్లాడుతూ “మా నాన్నకు 14 భాషలు వచ్చు.నేను కూడా ఆరు భాషల్లో మాట్లాడగలను.నేను బడికి వెళ్లలేదు.నాన్నే నాకు ఇంట్లో చదువు చెబుతారు” అని చెప్పింది.ఉర్దూ, ఇంగ్లీష్, చిత్రాళి, సిరాకి, పంజాబీ, పష్తో(Urdu, English, Chitrali, Siraqi, Punjabi, Pashto), ఇలా ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు షుమైలా.

ఇక తన పని గురించి అడిగితే చిరునవ్వుతో “నేను వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు అమ్ముతాను.ఎవరికైనా కావాలంటే చెప్పండి” అంటూ ఎంతో ముద్దుగా సమాధానమిచ్చింది.అంతేకాదు.మరో వీడియోలో తన కుటుంబ విశేషాలను కూడా పంచుకుంది.తనకు ఐదుగురు తల్లులు, 30 మంది తోబుట్టువులు ఉన్నారని చెప్పడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.షుమైలా ప్రతిభ, ఆమె మాటతీరుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

షుమైలా ప్రతిభ, కాన్ఫిడెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ “ఆమె కాన్ఫిడెన్స్‌ అద్భుతం.అల్లా ఆమెను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి” అని పేర్కొన్నాడు.మరొకరు “ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే బడికి వెళ్లాల్సిన అవసరం లేదని షుమైలా నిరూపించింది” అని రాసుకొచ్చారు.ఇలా ఎందరో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

నిజానికి షుమైలా కథ ఫార్మల్ విద్యే సర్వస్వం కాదని, ప్రతిభకు చదువుతో సంబంధం లేదని చాటి చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube