జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) తన అభిమానులకు గట్టిగానే క్లాస్ పీకారు.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన(Janasena) ఉంది.
ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్న పవన్ ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు.తాను ఎక్కడికి వెళ్లినా తండోప తండాలుగా జనాలు , అభిమానులు, వస్తుండడం, తన పనులకు ఆటంకం కలిగిస్తూ ఉండడం పై పవన్ సీరియస్ అయ్యారు.
నేను మీసం తిప్పితే రోడ్లు పడతాయా ? నన్ను నా పని చేసుకోనివ్వరా ? మీరంతా నా చుట్టూ మూగితే రోడ్లు ఎలా ఉన్నాయో నాకు ఎలా కనపడుతుంది అంటూ పవన్ క్లాస్ పీకారు.
తాజాగా పార్వతీపురం జిల్లాలోని(Parvathipuram district) బాబుజోల గిరిజన గ్రామానికి వెళ్లిన పవన్ అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున తన అభిమానులు చుట్టుముట్టారు.దీనిపై పవన్ అసహనం వ్యక్తం చేస్తూ వారికి గట్టిగానే క్లాస్ పీకారు.
తనను పనిచేసుకొనివ్వాలని , ఇలా చుట్టూ ముడితే పనిచేసుకోలేనని అన్నారు. మీరంతా సినిమాల గురించి అడుగుతున్నారని , తాను ఇక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించి వాటిని బాగు చేయించడానికి వచ్చానని పవన్ అన్నారు.
అలా కాకుండా మీరంతా నన్ను చుట్టుముట్టి సినిమాలు గురించి అడిగితే మీకు సరైన రోడ్లు రావని అన్నారు.తాను సినిమాలో మీసం తిప్పితే చాతి కొట్టుకుంటే రోడ్లు పడవని , తాను వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితేనే రోడ్లు వస్తాయని పవన్ Will I get votes if I trim my moustache? Pawan Kalyan asksఅన్నారు.ఈ పనుల మీద తాను ఇక్కడికి వస్తే మీసం తిప్పండి అది చేయండి ఇది చేయండి అంటారని తనను పనిచేసుకోని అవ్వాలని పవన్ కళ్యాణ్ (pawan kalyan) తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.