నైట్ ఈ టీని ఒక్క కప్పు తీసుకుంటే చాలు గురక పెట్టి నిద్రపోతారు!

సాధారణంగా కొందరికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు.ఎంత ప్రయత్నించినా సరే కంటికి కునుకు కరువవుతుంటుంది.

 This Tea Helps To Promote Good Sleep! Golden Tea, Tea, Health, Health Tips, Good-TeluguStop.com

దీని కారణంగా ఉదయానికి తలనొప్పి, చిరాకు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి.ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.

అలాగే కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.అందుకే ప్రశాంతంగా నిద్రపోవడం కోసం ఎక్కువ శాతం మంది స్లీపింగ్ పిల్స్ ను వాడుతుంటారు.

అయితే వాటిని క్రమంగా వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ టీని రోజు నైట్ ఒక కప్పు చొప్పున‌ తీసుకుంటే చాలు గుర‌క‌ పెట్టి మ‌రీ నిద్రపోతారు.

ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Golden Tea, Sleep, Tips, Problems-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), మూడు నుంచి నాలుగు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్( Yellow horn slices ), అర అంగుళం పొట్టు తొలగించి దంచిన అల్లం ముక్క( ginger ), నాలుగు మిరియాలు వేసి ఐదారు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో ఈ గోల్డెన్ టీ ఫిల్టర్ చేసుకుని వేడివేడిగా సేవించాలి.

Telugu Golden Tea, Sleep, Tips, Problems-Telugu Health

రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ టీ ని తీసుకోవాలి.ఈ గోల్డెన్ టీ నిద్రలేమి సమస్యను వదిలించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.రోజు ఈ టీ ని తీసుకుంటే ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.గ్యారెంటీగా గురక పెట్టి నిద్రపోతారు.పైగా ఈ టీ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.బాన పొట్ట కొద్దిరోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube