తెలంగాణ సి‌ఎం ఎవరు..? ఏంటి ఈ కన్ఫ్యూజన్ ?

తెలంగాణలో ప్రస్తుతం ఒక ప్రశ్న అందరినీ వెంటాడుతోంది.ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గెలిచి బి‌ఆర్‌ఎస్( BRS ) మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు సి‌ఎం బాధ్యతలు ఎవరు చేపడతారనేది.

 Who Is Telangana Cm Kcr Or Ktr Details, Brs, Kcr, Ktr, Telangana Politics, Telan-TeluguStop.com

ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ మళ్ళీ గెలిస్తే సి‌ఎం గా మళ్ళీ కే‌సి‌ఆరే ( KCR ) కొనసాగుతారా లేదా తనయుడు కే‌సి‌ఆర్ ఆ బాధ్యతలను చేపడతారా అనే విషయం ఒక అంతు చిక్కని ప్రశ్నగా ఉంది.వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే సి‌ఎం గా కే‌సి‌ఆర్ పదవి చేపడతారని బి‌ఆర్‌ఎస్ నేతలు పదే పదే చెబుతున్నారు.

అటు కే‌సి‌ఆర్ కూడా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో ఇక రాష్ట్ర బాధ్యత అంత కే‌టి‌ఆరే భుజాన వేసుకుంటారని తెలంగాణ ప్రజలంతా భావిస్తున్నారు.

Telugu Brs Cm, Cm Ktr, Ktr, Telangana Cm, Telangana-Politics

అయితే నెక్స్ట్ సారి కూడా సి‌ఎంగా కే‌సి‌ఆరే ఉంటారని, హ్యాట్రిక్ సి‌ఎం గా ఆయన చరిత్రలో నిలిచిపోతారని కే‌టి‌ఆర్ ( KTR ) ఆ మద్య స్పష్టం చేశారు.దీంతో ఈ ప్రశ్నకు తెరపడినట్లైంది.అయితే తాజాగా శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కే‌సి‌ఆర్ డిల్లీ పై దృష్టి పెడితే తెలంగాణ సి‌ఎం గా కే‌టి‌ఆరే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

దీంతో మళ్ళీ రాష్ట్రంలో సి‌ఎం పదవిపై చర్చ జరుగుతోంది.ప్రస్తుతం కే‌సి‌ఆర్ తెలంగాణపై కంటే జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఇతర రాష్ట్రాలలో పర్యటనలు చేస్తూ పార్టీని విస్తరించే పనిలో నిమగ్నం అయి ఉన్నారు.

Telugu Brs Cm, Cm Ktr, Ktr, Telangana Cm, Telangana-Politics

దాంతో రాష్ట్ర బి‌ఆర్‌ఎస్ బాద్యతలు కే‌టి‌ఆరే చూసుకుంటున్నారు.ఇప్పటికే కే‌టి‌ఆర్ నాయకత్వానికి ప్రజల నుంచి అటు బి‌ఆర్‌ఎస్ శ్రేణుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.ఈ నేపథ్యంలో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిస్తే.

హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కే‌సి‌ఆర్ బాధ్యతలు చేపట్టినప్పటికి.పాలన మాత్రం కే‌టి‌ఆరే కొనసాగిస్తాననేది కొందరి అభిప్రాయం.

అంటే సి‌ఎం గా పేరు కే‌సి‌ఆర్ దే అయినప్పటికి, పదవి పాలన మొత్తం కే‌టి‌ఆర్ చూసుకునే అవకాశాలు ఉన్నాయి.ఇక వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బి‌ఆర్‌ఎస్ ఆ టార్గెట్ ను రిచ్ అవుతుందా ? లేదా ప్రతిపక్ష పార్టీలు షాక్ ఇస్తాయా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube