అందమైన,ఆరోగ్యమైన కళ్ళకు అద్భుతమైన ఆహారాలు

Best Foods For Healthy And Beautiful Eyes

కళ్ళు అందంగా,ఆరోగ్యంగా కనపడితే ముఖం కూడా కాంతిగా మెరుస్తూ ఉంటుంది.ఆరోగ్యకర ఆహారం, మంచి నిద్ర, కొన్ని సహజ వైద్యాలు మీ కళ్ళకు మంటలు, ఎరుపు ఇతర అసౌకర్యాలను దూరంగా వుంచుతాయి.

 Best Foods For Healthy And Beautiful Eyes-TeluguStop.com

కళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి.ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కంటి ఆరోగ్యానికి అవసరమైన ఎ,ఇ, సి విటమిన్స్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.ఈ విటమిన్స్ సమృద్ధిగా లభించే కేరట్లు, ఆపిల్స్, కివి పండు, విటమిన్ సి పండ్లు అయిన ఆరెంజ్, బత్తాయి, నిమ్మ, రేగుపండ్లను తింటూ ఉండాలి.

కళ్ళు ఒత్తిడికి గురి కాకుండా ఉండటానికి కంటి మీద కీరా దోస ముక్క లేదా బంగాళాదుంప ముక్కలను పెట్టుకొని పావుగంట సేపు ఆలా ఉండాలి.దాంతో కళ్ళ మీద ఒత్తిడి,అలసట మాయం అయ్యిపోతాయి.

విటమిన్ A సమృద్ధిగా లభించే బాదం పప్పులు, ఖర్జూరాలు, సోయా బీన్స్, గ్రీన్ బఠాణీలు తింటూ ఉంటె కంటి ఆరోగ్యం బాగుంటుంది.

పచ్చని ఆకుకూరలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్త ప్రసరణ బాగా పెరిగి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

పాల ఉత్పత్తులైన, వెన్న, పాలు, జున్ను, మజ్జిగ మొదలైనవి కూడా కంటికి మంచివి.అవి కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఈ విధంగా మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ దుమ్ము నుండి రక్షణ కలిగి ఉంటే సరిపోతుంది.ఈ ఆహారాలను తింటూ ఈ చిట్కాలను పాటిస్తే కళ్ళు అందంగా,ఆరోగ్యంగా ఉంటాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube