జగన్ తొందరపడ్డాడు .. వాళ్ళని గోదారిలో ముంచబోతున్నాడా ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యక్తిగత విమర్శల ప్రకంపనలు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వైసీపీ కే తగులుతున్నాయి.పాతాళంలో ఉన్న పార్టీని జగన్ చాలా కస్టపడి మరీ పైకి తీసుకొచ్చాడు.

 Jagan Comments On Pawan Reflects On Kapu Vote Bank-TeluguStop.com

పాదయాత్ర చేస్తూ … పార్టీకి మంచి ఊపుకు కూడా తీసుకొచ్చాడు.ఎన్నికల సమయానికి పార్టీ మరింత పుంజుకోవడం ఖాయం అని… ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయడం ఒక్కటే మిగిలి ఉంది అనుకునున్న సమయంలో జగన్ పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ మిగల్చబోతోంది.

ఇది రాజీకీయంగా జగన్ చేసిన పొరపాటని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.ఇక పవన్ సామజిక వర్గం వారు వైసీపీ పై గుర్రుగా చూస్తున్నారనే సంకేతాలు ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

పవన్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్ గతంలో కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.చంద్రబాబును ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పులతో కొట్టాలని జగన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

మరోసారి మరింత తీవ్రంగా.చంద్రబాబును ఉరి తీయాలని వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా చంద్రబాబును కాల్చి చంపాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సహజమే కానీ ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం.

పైగా చంపేయాలంటూ పిలుపునివ్వడం జగన్ ఆవేశానికి అర్ధం పడుతోంది.

తనకు నచ్చనివారిపై ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్న జగన్.ఇలాంటి వ్యాఖ్యల వల్ల కలిగే పర్యవసానాన్ని గమనించడం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.ఒక పార్టీ అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనేది వారి వాదన.

ఏ మాత్రం ఓపిక, సహనం లేకుండా.ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆలోచించకుండా పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు కాపుల కంచుకోటలైన గోదావరి జిల్లాల్లో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి.ముఖ్యంగా .తూర్పుగోదావరి జిల్లాలో టికెట్లు ఆశిస్తున్న వైసీపీ నేతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్‌లలో వైసీపీ నుంచి కాపు సామాజికవర్గ నేతలే అధికంగా ఆశావహులు ఉన్నారు.

పై ఆరు చోట్లా కోఆర్డినేటర్లుగా కాపులే ఉన్నారు.ఆ నేతలకే టికెట్లు ఖరారయ్యే పరిస్థితి.ఈ నేపథ్యంలో జగన్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఆశావహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను కాపు సామాజిక వర్గం తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై చేసిన వ్యాఖ్యలుగా భావిస్తే వైసీపీకి 2019 ఎన్నికల్లో నష్టం వాటిల్లుతుందని వైసీపీ టికెట్ ఆశిస్తున్న కాపు నేతలు ఆందోళన చెందుతున్నారు.

పార్టీ పరిస్థితి మెరుగయ్యింది అనుకునుటున్న సమయంలో జగన్ తన నోటి దురుసుతో మొత్తం చెడగొట్టేసాడని ఆ నాయకులు తెగ బాధపడిపోతున్నాడు.మరి ఈ డ్యామేజీ ని జగన్ ఎలా పూడ్చుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube