కన్నీళ్లు పెట్టించే ఘటన.. కారు కింద నలిగిన లేగదూడ.. వెంబడించిన ఆవులు?

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో (Raigad, Chhattisgarh)జరిగిన ఓ హృదయవిదారక సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.ఒక కారు లేగదూడను ఢీ కొట్టి, దాన్ని కింద పడేసి దాదాపు 200 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకుపోయింది.

 A Tear-jerking Incident.. A Calf Crushed Under A Car.. The Cows That Chased It?,-TeluguStop.com

స్టేషన్ చౌక్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం చూపరులను దిగ్భ్రాంతికి గురిచేసింది.కారు లేగదూడను ఢీకొనడంతో అది కారు కింద ఇరుక్కుపోయింది.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.వైరల్ వీడియోలో కనిపించినట్లు ఆ లేగదూడ చేస్తున్న ఆర్తనాదాలు దగ్గరలోని ఆవుల గుంపును కలచివేశాయి.

తల్లి ప్రేమకు సాటి ఏదీ రాదు.తన బిడ్డ ప్రమాదంలో ఉందని గ్రహించిన ఓ ఆవు కారును అడ్డుకునేందుకు తెగించింది.ప్రాణాలకు తెగించి కారు ముందు నిలబడి దానిని కదలనివ్వకుండా అడ్డుకుంది.దూడ తల్లి అని భావిస్తున్న ఆ ఆవు ధైర్యానికి, ప్రేమకు స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

తల్లి ఆవుతో పాటు మిగతా ఆవులు కూడా ఐక్యమత్యమై కారు ముందు నిలబడ్డాయి.ఈ దృశ్యం అక్కడున్నవారి హృదయాలను కదిలించింది.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతుప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు.కారు కింద చిక్కుకున్న లేగదూడను సురక్షితంగా బయటకు తీయడానికి సహాయం చేశారు.రెస్క్యూ వీడియోల్లో, సహాయక చర్యల్లో పాల్గొన్నవారు దూడకు మరింత గాయం కాకుండా చాలా జాగ్రత్తగా బయటకు తీశారు.

తీవ్ర గాయాలపాలైనప్పటికీ, దూడ ప్రాణాలతో ఉండటంతో వెంటనే చికిత్స కోసం తరలించారు.కారును ఎత్తి దూడను బయటికి తీసే సమయంలో ఆవుల గుంపు ఆ కారు చుట్టే తిరుగుతూ ఉంది.

ఆ కారుని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా దూడను కాపాడుకోవడానికి అవి చేస్తున్న ప్రయత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అవు దూడ పైకి లేచి కాళ్లపై నిలబడినప్పుడు వెంటనే తల్లి దాని దగ్గరికి వచ్చింది.

ఆప్యాయంగా దానిని స్పర్శించింది.ఆ క్షణాలు చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు.ఆవుల రక్షణాత్మక స్వభావాన్ని, స్థానికుల చొరవను చాలామంది ప్రశంసిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన కచ్చితమైన తేదీ తెలియదు.ఈ వీడియో చూసిన చాలామంది ఆవుల పరిస్థితిని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు.కళ్ళ ముందే ఇలాంటి ఘోరం జరగటం చూసి అవి తల్లడిల్లిపోయి ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తే గాని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావని వ్యాకనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube