ఇక పరుగులు పెట్టిద్దాం .. ఏపీపై బిజెపి ఫోకస్ 

ఏపీలో బిజెపిని(BJP , AP) బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అధిష్టానం పూర్తిగా దృష్టి సారించింది.తెలంగాణలో ఏ స్థాయిలో అయితే బిజెపిని బలోపేతం  చేస్తున్నారో అంతే స్థాయిలో ఏపీలోనూ పట్టు పెంచుకోవాలనే ప్రయత్నాల్లో బిజెపి (BJP)అధిష్టానం ఉంది.

 Let's Keep Running.. Bjp's Focus On Ap, Ap Government, Tdp, Bjp, Janasena, Ap Bj-TeluguStop.com

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా(TDP, Janasena, BJP alliance) ఏర్పడి ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయ్యింది.  ప్రభుత్వంలోనూ బిజెపి భాగస్వామిగా ఉంది.

ప్రస్తుతానికి ఇక్కడ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేకపోయినా , ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.

Telugu Ap Bjp, Ap, Janasena-Politics

క్షేత్రస్థాయి నుంచి బీజేపీకి బలం పెరిగేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది.దీనికోసం జనసేన మద్దతు తీసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట.భవిష్యత్తులో ఏపీలో మరింత పట్టు పెంచుకునే విధంగా ప్రణాళకలు రచిస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేశారట.పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరూ కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారట.

Telugu Ap Bjp, Ap, Janasena-Politics

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు జిల్లా రాష్ట్ర నాయకత్వాలకు సూచనలు చేస్తూ,  క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారట.గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం,  రెండో స్థానానికి పరిమితమైన నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేసి ఇప్పటికే జాతీయ నాయకత్వానికి రాష్ట్ర బిజెపి నాయకులు పంపారట .బిజెపి(BJP) నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుని వారి ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారట.వచ్చే జమిలీ ఎన్నికల నాటికి టీడీపీ , వైసీపీ(TDP, YCP) లకు ప్రత్యామ్నాయంగా బిజెపిని బలోపేతం చేసే విధంగా పార్టీ నాయకులంతా కష్టపడి పనిచేయాలని అగ్ర నాయకులు ఆదేశించారట.

  జనసేనతో పొత్తు బంధం మరింతగా ఎంచుకుంటూనే దశలవారీగా బలం పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయం పైన బీజేపీ అధిష్టానం దృష్టి సారించిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube