అల్లు బ్రాండ్ చెక్కు చెదురుతోందిగా.. బన్నీ ఆ ఇబ్బందులను ఎదుర్కోనున్నారా?

స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) 20 ఏళ్లుగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.చాలామంది హీరోలతో పోల్చి చూస్తే బన్నీ సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే.

 New Troubles To Star Hero Allu Arjun Brand Details, Allu Arjun, Icon Star Allu A-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో బన్నీ బ్రాండ్ చెక్కు చెదురుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుస వివాదాల వల్ల బన్నీకి యాడ్ ఆఫర్లు గతంలోలా వస్తాయా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

స్టార్ హీరో అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం పలు నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి.అయితే ఇప్పటికే ఉన్న ఆఫర్లకు ఇబ్బందులు లేవు కానీ కొత్త బ్రాండ్స్ ఆఫర్లు రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి బన్నీకి ఉన్న క్రేజ్ కు పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా రిలీజైన తర్వాత ఊహించని స్థాయిలో మూవీ ఆఫర్లు రావాలి.కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Icon Allu Arjun, Pushpa, Pushpa Rule, Tollyw

అల్లు బ్రాండ్ కు( Allu Brand ) పూర్వ వైభవం రావాలంటే బన్నీ సరైన దిశలో అడుగులు వేయాల్సి ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.స్టార్ హీరో అల్లు అర్జున్ సరైన కథలను ఎంచుకుని ఎన్నో రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Icon Allu Arjun, Pushpa, Pushpa Rule, Tollyw

స్టార్ హీరో అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాలతో సంచలనాలు సృష్టించాలని కెరీర్ పరంగా పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సినిమాలకు మాత్రం బన్నీ రెమ్యునరేషన్ రికార్డ్ స్థాయిలో ఉంది.ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరో 200 నుంచి 250 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube