‘ రా ’ ఏజెంట్‌నంటూ ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం .. వెలుగులోకి జిమ్ ట్రైనర్ బాగోతం

ఆగ్రాలో( Agra ) దారుణం జరిగింది.నగరానికి చెందిన ఓ జిమ్ ట్రైనర్( Gym Trainer ) తనను తాను భారత గూఢచార సంస్థ అయిన రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా పరిచయం చేసుకుని భారత సంతతికి చెందిన కెనడా జాతీయురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 Gym Instructor Poses As Raw Agent In Agra Rapes Indian Origin Woman Of Canada De-TeluguStop.com

రంగంలోకి దిగిన ఆగ్రా పోలీసులు సదరు జిమ్ ట్రైనర్‌పై అత్యాచారం, క్రిమినల్ బెదిరింపు వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు.అయితే ఈ ఘటనలో అతని స్నేహితుడు కూడా పాల్గొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తనపై జిమ్ ట్రైనర్ అతని మిత్రుడు అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు ఆగ్రా పోలీసులకు( Agra Police ) ఫిర్యాదు చేశారు.ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.

అనంతరం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆగ్రా డీసీపీ మీడియాకు తెలిపారు.

Telugu Agra, Agra Gym, Canada, Raw, Gym, Indian Origin, Sahil Sharma-Telugu NRI

నిందితుడు సాహిల్ శర్మ( Sahil Sharma ) ఈ ఏడాది మార్చిలో ఆగ్రా హోటల్‌లో ఆమెను కలవడానికి ముందు టిండర్‌ అనే యాప్‌లో బాధితురాలితో స్నేహం చేశాడు.హోటల్‌లో ఆమెకు మత్తు పదార్ధాలను ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తాను రా ఏజెంట్‌నని( Raw Agent ) బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా వెల్లడించారు.

ఈ ఘటన తర్వాత కెనడాకు( Canada ) వెళ్లిపోయినప్పటికీ నిందితుడు బాధితురాలితో టచ్‌లో ఉన్నాడని పోలీసులు చెప్పారు.రా పేరు చెప్పి ఈ ఏడాది ఆగస్టులో మరోసారి భారత్‌కు రావాల్సిందిగా ఆమెపై ఒత్తిడి చేసినట్లు వెల్లడించారు.

Telugu Agra, Agra Gym, Canada, Raw, Gym, Indian Origin, Sahil Sharma-Telugu NRI

ఈ క్రమంలో ఢిల్లీ, ఆగ్రాలలో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.తన స్నేహితుడు ఆరిఫ్ అలీని పరిచయం చేసి అతనితో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.ఈ పరిణామాలతో బాధితురాలు గర్భం దాల్చగా.నీ ప్రైవేట్ ఫోటోలను ఆన్‌లైన్‌లో పెడతానంటూ జిమ్ ట్రైనర్‌ ఆమెను బెదిరించినట్లుగా పోలీసులు వెల్లడించారు.అలాగే తాను నగ్నంగా ఉన్న ఫోటోలతో ఆరిఫ్ వేధింపులకు పాల్పడినట్లుగా బాధితురాలు ఆరోపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube