పసుపు.దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
నిత్యం వంటల్లో విరివిగా ఉపయోగించే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.సౌందర్య పరంగా కూడా పసుపును పూర్వ కాలం నుంచి ఉపయోగిస్తారు.
ముఖ్యంగా పసుపు టీని తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలో పసుపు టీ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే ప్రతి రోజు పాలతో కలిపిన టీ, కాఫీలకు బదులుగా.పసుపు టీ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే అధిక బరువుకు కూడా పసుపు టీతో చెక్ పెట్టవచ్చు.పరగడుపున పసుపు టీ తాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి.అదనపు కొవ్వును కరిగిస్తుంది.పసుపు టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.ప్రతి రోజు పసుపు టీ తాగడం వల్ల గుండెకు రక్తం సరఫరా బాగా జరగడంతో పాటు గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది.
ఇక నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు.అలాంటి వారికి పసుపు టీ ఔషధంలా పని చేస్తుంది.ప్రతి రోజు ఒక కప్పు పసుపు టీ తాగేగి.బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
అలాగే ఉదయాన్నే పసుపు టీ తాగడం వల్ల మతిమరుపు దూరం అయ్యి.ఆలోచించే శక్తి రెట్టింపు అవుతుంది.
పసుపు టీ తాగడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.