సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) శోభిత( Sobhita ) త్వరలోనే పెళ్లి( Wedding ) పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి.నాగచైతన్యకు ఇది రెండో వివాహం అనే సంగతి మనకు తెలిసిందే.
ఈయన మొదట సమంతను( Samantha ) ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య శోభితను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.
ఇక వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు.ఇలా ఏ సినిమాలోను నటించిన వీరిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ కలిగింది.అయితే ఈ విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు.
తనకు శోభిత పరిచయం ఎక్కడ ఏర్పడింది ఏంటి అనే విషయాలను ఈయన వెల్లడించారు.నేను నా ఓటీటీ షో లాంచ్ కోసం నేను ముంబై వెళ్లాను.అదే సమయంలో అదే ప్లాట్‌ఫామ్ ఆమె కూడా ఓ షో చేస్తోంది.ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేసిన షోలోనే మేమిద్దరం తొలిసారి కలిసి మాట్లాడుకున్నామని చైతన్య తెలిపారు.
అలా మొదలైన మా పరిచయం ప్రేమగా మారిందని నాగచైతన్య తెలియజేశారు.ఇక శోభిత కుటుంబ సభ్యుల గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.శోభిత కుటుంబ సభ్యులు నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు.సొంత కొడుకు లాగా చూసుకుంటారు.ఆ కుటుంబంతో నా ప్రయాణాన్ని చాలా సౌకర్యంగా ఫీల్ అవుతున్నానని చైతన్య తెలిపారు.మా రెండు కుటుంబాలలో చాలా విషయాలు కామన్ గా ఉన్నాయి.
ఇప్పటికే చాలా పండుగలను మా రెండు కుటుంబాలు కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాయి అంటూ నాగ చైతన్య శోభిత కుటుంబం గురించి ఆమెతో తొలి పరిచయం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.