మధుమేహం నుంచి నిద్రలేమి వరకు అనేక జబ్బులకు ఔషధం స్టార్ సోంపు.. ఇంతకీ ఎలా వాడాలంటే?

సోంపు( anise ) గురించి మనందరికీ తెలుసు.అయితే స్టార్ సోంపు ( Star anise )గురించి మాత్రం ఎవరికీ పెద్దగా అవగాహన లేదు.

 Incredible Health Benefits Of Star Anise! Star Anise, Star Anise Health Benefits-TeluguStop.com

మన ఇండియన్‌ స్పైసెస్ లో స్టార్ సోంపు కూడా ఒకటి.దీనిని చక్ర ఫూల్ అని అంటారు.

మన వాడుక భాషలో చెప్పాలంటే అనాస పువ్వు.తీపి, కారం రుచుల కలయికలో ఉండే స్టార్ సోంపును మసాలా పౌడర్స్‌ తయారీలో వాడతారు.

అలాగే బిర్యానీ, పులావ్ మరియు నాన్ వెజ్ వంటల్లో విరివిరిగా స్టార్ సోంపును వినియోగిస్తారు.కుక్కీలు, కేకులు మరియు బ్రెడ్‌లకు ప్రత్యేకమైన రుచిని జోడించడానికి సైతం స్టార్ సోంపును ఉపయోగించడం జరుగుతోంది.

చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండడమే కాదు స్టార్ సోంపులో కాల్షియం, ఐరన్, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్ ( Calcium, Iron, Potassium, Protein, Fiber )తో సహా ఎన్నో ముఖ్యమైన పోషకాలు నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్య పరంగా ఇది ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.

నిద్రలేమి నుంచి మధుమేహం వరకు అనేక జబ్బులకు ఔషధంలా పనిచేస్తుంది.స్టార్ సోంపులో ఫైటో ఈస్ట్రోజెన్లు ఉంటాయి.

ఈ సమ్మేళనాలు హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడతాయి.

Telugu Chakri Phool, Tips, Indian, Latest, Anise Benefits, Sompu-Telugu Health

స్టార్ సోంపు లో యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )పుష్కలంగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో తోడ్ప‌డతాయి.అదే స‌మ‌యంలో క్యాన్స‌ర్ కు కార‌ణ‌మ‌య్యే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.

అలాగే స్టార్ సోంపులో ఉండే ఫైబ‌ర్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి.మ‌ధుమేహం ఉన్న‌వారికి అండ‌గా నిలుస్తాయి.నిద్రలేమిని తరిమి కొట్టి సత్తా కూడా స్టార్ సోంపుకు ఉంది.దీనిలో ఉండే పలు సమ్మేళనాలు నిద్ర హార్మోన్లను ప్రేరేపితం చేస్తాయి.

ప్రశాంతమైన నిద్రను అందిస్తాయి.

Telugu Chakri Phool, Tips, Indian, Latest, Anise Benefits, Sompu-Telugu Health

అంతేకాకుండా శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, వెయిట్ లాస్ ప్ర‌య‌త్నాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలో, ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్స‌హించ‌డంలో కూడా స్టార్ సోంపు స‌హాయ‌ప‌డుతుంది.ఇక ఈ ప్రయోజనాలన్నీ పొందడానికి స్టార్స్ వంపును ఎలా తీసుకోవాలి అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి.స్టార్ సోంపును అనేక విధాలుగా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

గ్లాస్ వాటర్ లో ఒక స్టార్ సోంపును నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే మరిగించి ఆ వాటర్ ను తీసుకోవచ్చు.అలాగే మీరు నిత్యం తాగే టీ లో స్టార్ సోంపు ని యాడ్ చేసుకోవచ్చు.

దీని వల్ల ప్రత్యేకమైన రుచి ఫ్లేవర్ తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాల‌ను కూడా పొందుతారు.అయితే మంచిది కదా అని స్టార్ సోంపును అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి జాగ్రత్త!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube