తెలుగు చలన చిత్రాల్లో ప్రత్యేక పాత్రలో నటించే సీనియర్ నటుడు సమీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అతను కేవలం సినిమాల్లోనే కాకుండా ఎన్టీఆర్ వ్యాక్యతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 షోలో కూడా కంటస్టెంట్ గా పాల్గొంన్నాడు.
ఈ నేపథ్యంలోనే తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి కొన్ని ఇంటర్వ్యూలలో బయట పెట్టగా దాని వల్లనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు.
ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, క్యాష్ లాంటి ఎంటర్ టైన్మెంట్ షో లో పాల్గొనే ఆర్టిస్టుల గురించి వాళ్లు చేసే అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక అలాంటి మరో ఎంటర్టైన్మెంట్ షో ‘సాయి కుమార్’ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో’ మొదట రెండు సీజన్ లను పూర్తి చేసుకొని ప్రస్తుతం మూడవ సీజన్ లో అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ షోలో చాలా మంది స్టార్లు గెస్ట్ లుగా పాల్గొని వారి గురించి చెప్పి అలరించే సంగతి తెలిసిందే.
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా సాయి కుమార్ వావ్ షోలో నటుడు సమీర్, నటి జ్యోతి, ప్రభాస్ శీను, మహేష్ ఆచంట వస్తున్నట్లు ప్రోమో విడుదల చేశారు.ఇక అందులో సమీర్ జ్యోతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.
అది విని అందరూ షాక్ అయ్యారు అంటే నమ్మండి.అసలు ఏం చేశాడు అంటే.
అయితే ఈ గేమ్ షోల్లో సమీర్ ఎంతో అల్లరితో ఆటను మొదలుపెట్టగా సాయికుమార్ సమీర్ తో కాస్త కామెడీ చేశాడు.
అదేంటంటే సమీర్ ను ‘రాత్రి ఒంటి గంట తర్వాత కూడా ఫోన్లు బాగా చేస్తున్నారట’ అని సాయికుమార్ అడగడంతో సమీర్ చేయాల్సి వస్తుందని కామెంట్ విసిరాడు.ప్రత్యేకంగా సినిమాలే కాకుండా ఇంకా ఏమైనా చూస్తావా అని సాయికుమార్ అడగగా… అన్నీ చూస్తా అంటూ సమీర్ మాట విసరడంతో పక్కన ఉన్న జ్యోతి అన్ని అంటే ఏంటి అని ప్రశ్నించింది.దీంతో సాయి కుమార్ ఆమెను ఏం చూస్తావ్ అని ప్రశ్నించగా ”ఓన్లీ అవే చూస్తుంది” అంటూ సమీర్ జవాబిచ్చాడు.
దీంతో జ్యోతి సమీర్ ను కొట్టేందుకు రాగా ఆ ప్రోమోకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.