ఇటీవల ఒక ఇండియన్-కెనడియన్ కపుల్( Indian-Canadian Couple ) తమ వివాహానికి ముందు తాము ఇరువురి సంస్కృతుల గురించి కొన్ని అబద్ధాలు విన్నామని తెలిపారు.ఈ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇండియన్ కెనడియన్ కపుల్’ అనే పేరుతో ఫేమస్ అయ్యారు.
వీరు తమ వీడియోకి “వివాహానికి ముందు మాకు చెప్పిన అబద్ధాలు.నిజమైన ప్రేమే అన్ని అపోహలను జయిస్తుంది” అని క్యాప్షన్ జోడించారు.
ఈ వీడియోను ఇప్పటికే 1 కోటి 7 లక్షల మందికి పైగా చూశారు.ఈ క్లిప్ సెన్సేషనల్‌గా మారడంతో దీనికి గంటల్లోనే లక్షల కొద్ది వ్యూస్ వస్తూనే ఉన్నాయి.
ఈ దంపతులు తమ వీడియోలో వివిధ సంస్కృతుల గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, ఆ అపోహలు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనే విషయాల గురించి చర్చించారు.వీరి లవ్ స్టోరీ( Love Story ) చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.
అంతేకాకుండా, వివిధ సంస్కృతుల గురించి మన అపోహాలను ( Misconceptions ) వదిలించుకోవడం ఎంత ముఖ్యమో ఈ వీడియో మరోసారి నిరూపిస్తుంది.
ఈ దంపతుల్లో భార్య పేరు డేనియల్,( Danielle ) భర్త పేరు ఏకాంశ( Ekansha ) అని.డేనియల్ కెనడియన్ అయినా, భారతీయ సంస్కృతి( Indian Culture ) గురించి చాలా అపోహలు విన్నట్లు చెప్పింది.ఆమె మాట్లాడుతూ “చాలామంది భారతీయ పురుషులు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంటారని, భారతీయులు డీయోడరెంట్ వాడరని, భారతదేశం మహిళలకు సురక్షితం కాదని విన్నాను.” అని చెప్పింది.
అదే విధంగా, ఎకాంష్ కూడా కెనడియన్స్ గురించి చాలా అబద్ధాలు విన్నాడు.“ఒక కెనడియన్ మహిళను పెళ్ళి చేసుకుంటే ఆ పెళ్లి కొంత సమయంలోనే పెటాకులు అవుతుంది.పాశ్చాత్యులు తల్లిదండ్రులను గౌరవించరు, నీ భార్య నీ దగ్గర నుంచి డబ్బు అంతా తీసుకొని వెళ్ళిపోతుంది” అని అతనికి చెప్పినట్లు చెప్పాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి, ప్రజల్లో చాలా చర్చను రేకెత్తిస్తోంది.ఈ వీడియోకు 1,33,000 లైక్‌లు వచ్చాయి.వందలాది కామెంట్లు వస్తున్నాయి.ఒక యూజర్ “ఏంటి భారతీయులు ఇద్దరు మహిళలను పెళ్ళి చేసుకుంటారా? ఒకరిని చూసుకోవడమే కష్టం, ఇద్దరిని పెళ్ళి చేసుకోవడం చట్టవిరుద్ధం, అసాధ్యం!” అని వ్యాఖ్యానించారు.మరొకరు “ఒక భారతీయుడిని పెళ్ళి చేసుకునే ముందు, నా కుటుంబం అతను గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత నన్ను వదిలేస్తాడని హెచ్చరించారు.మేం 17 సంవత్సరాలుగా సంతోషంగా ఉన్నాము” అని కామెంట్ చేశారు.