గత కొద్దిరోజులుగా ఆదిలాబాద్ జిల్లాలోని( Adilabad District ) ఇథనాల్ ఫ్యాక్టరీ కి( Ethanol Factory ) సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వివాదం చోటుచేసుకుంది.ముఖ్యంగా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దే అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.
ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కుటుంబంతో బంధుత్వం ఉన్నవారిదేనని , తలసాని కుమారుడు అందులో డైరెక్టర్ గా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఆ ఫ్యాక్టరీతో తమకు సంబంధం లేదని , ఇప్పటికే శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
అయినా కాంగ్రెస్ దీనిపై విమర్శలు చేస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫ్యాక్టరీ తమదేనని టిడిపి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్( MLA Putta Sudhakar Yadav ) ప్రకటించారు .అది తమ కుమారుడు పుట్టా మహేష్( Putta Mahesh ) పెట్టిన కంపెనీ అని ప్రకటించారు.పుట్టా మహేష్ ప్రస్తుతం ఏలూరు టిడిపి ఎంపీగా ఉన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ ఫ్యాక్టరీ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతుండడంతో దీనిపై పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించి , అది తమదే అని ప్రకటించారు. ఈ ఇథనాల్ ప్రాజెక్ట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, పూర్తి అనుమతులతో ఈ కంపెనీని నిర్మిస్తున్నామని పుట్టా సుధాకర్ ప్రకటించారు.
పరిశ్రమలపై కుట్రలు చేయడం సరికాదని పె, ట్టుబడులు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.
రాజకీయాల్లో భాగంగానే ఇథనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రజలను రెచ్చగొట్టి ఆందోళనకు కారణం అవుతున్నారని సుధాకర్ యాదవ్ మండిపడ్డారు.ఇక బిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ పైన కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.అనుమతులు పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని , ఇప్పుడు తమపై బురద జల్లుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
అసలు ఈ ఇథనాల్ కంపెనీకి సంబంధించి మొత్తం వివరాలను బయటపెడతామని ప్రకటించారు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామని, దీనికి సంబంధించిన పనులను పూర్తిగా నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.