పుష్ప 2 విడుదల... బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప2( Pushpa 2 ) సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.గత మూడు సంవత్సరాలుగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 Vijay Devarakonda Send Special Gift For Bunny Details, Vijay Devarakonda,allu Ar-TeluguStop.com

ఇక ఈ సినిమా అత్యధిక థియేటర్లలో డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Pushpa Rowdy, Rowdy Pushpa-Movie

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే పలు నగరాలలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా భారీగా ఈవెంట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అవుతారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్ పంపించారు.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Pushpa Rowdy, Rowdy Pushpa-Movie

ఈ గిఫ్ట్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ విజయ్ దేవరకొండకు స్పెషల్ థాంక్స్ తెలియజేశారు.మరి విజయ్ దేవరకొండ అల్లు అర్జున్  కి పంపిన గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే ఆయన రౌడీ బ్రాండ్ తో క్లాత్ బిజినెస్ చేస్తున్న విషయం మనకు తెలిసింది.ఈ క్రమంలోనే రౌడీ పుష్ప( Rowdy Pushpa ) అని రాసి ఉన్నటువంటి టీ షర్టులను అల్లు అర్జున్ కోసం స్పెషల్ గా పంపించారు.

ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన అల్లు అర్జున్ థాంక్యూ సో మచ్ మై డియర్ స్వీటెస్ట్ బ్రదర్ అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా బన్నీ వైల్డ్ ఫైర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube