నువ్వే కావాలి, ప్రేమించు, డార్లింగ్ డార్లింగ్, గోపి గోడమీద పిల్లి వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయిన సాయికిరణ్ ( Saikiran )మీకు తెలిసే ఉంటుంది.సాయి కిరణ్ ప్రముఖ సింగర్ వి.
రామకృష్ణకు( Singer V.Ramakrishna ) స్వయంగా కుమారుడవుతాడు.రీసెంట్గా బింబిసార సినిమాలో కూడా నటించాడు.కేవలం సినిమాల్లోనే కాదు సీరియల్స్‌లో కూడా నటిస్తుంటాడు.ఇంతకుముందు “ఇంటిగుట్టు” సీరియల్లో యాక్ట్ చేశాడు.ఇప్పుడు ప్రసారమవుతున్న “గుప్పెడంత మనసు”లో మహేంద్ర భూషణ్ ( Mahendra Bhushan )పాత్రలో నటిస్తున్నాడు.
అయితే సాయి కిరణ్ ఓన్లీ యాక్టర్ మాత్రమే కాదు ఇతను ఒక స్నేక్ రెస్క్యూలర్ కూడా.ఇప్పటిదాకా తాను ఒక వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్ తో కలిసి 3,000 పాములను రక్షించినట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.
హైదరాబాద్‌లో పాములను పట్టుకెళ్ళి శ్రీశైలం అడవుల్లో వదిలేస్తామని వెల్లడించాడు.ఒక్కో గోనె సంచిలో 16 దాకా పాములను ఉంచి వాటిని ఇన్నోవా కారులో వేసుకొని వెళ్తామని అన్నాడు.
అయితే ఒకానొక సమయంలో పాములు గోనె సంచిలో మూత్రం పోసాయట.ఈ విషయం తెలియని సాయికిరణ్ బస్తాపై భాగాన్ని పట్టుకొని బయటకు తీస్తుండగా ఒక్కసారిగా దారాలు బాగా మెత్తబడి తెగిపోయాయట.
రెప్పపాటు సమయంలోనే 16 పాములు తన కాళ్లపై పడ్డాయని ఆ క్షణంలో తాను స్టన్ అయ్యానని చెప్పాడు.
తన కాళ్ల చుట్టూ 16 తాచు పాములు పడక విప్పి నిల్చడంతో గుండా వేగంగా కొట్టుకుందని, అది గొంతు పైకి వచ్చినట్లుగా అనిపించిందని అన్నాడు.ఆ సమయంలో ఒక్క పాము కాటు వేసినా ఇక తాను తన జన్మలో మరొక పామును కాపాడకూడదని అనుకున్నాడట.అయితే ఆ పాములు మాత్రం తనని ఏమీ అనకుండా పొదల్లోకి వెళ్లిపోయాయట.
పాము ముందు కదలకుండా ఉంటే అది కాటు వేయకుండానే తన దారిని తాను పోతుందని ఇతను చెప్పాడు.కాలం ముందు ఉన్న అన్ని పాములు ( snakes )కూడా అలానే ఏమీ చేయకుండా వెళ్లిపోయాయని చెప్పాడు.
పొదల్లోకి వెళ్లిన తర్వాత అవి వెనక్కి తిరిగి చూసి ఒక థాంక్స్ లాగా చెప్పాయని, దృశ్యం చూసినప్పుడు తన కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయని అతను అన్నాడు.ఈ పాములను కొంతమంది పట్టుకొని వాటి కోరలు తీసేసి నోరు కట్టేస్తారట.అంతేకాదు మనుషులు తీసుకొచ్చే పాలను తాగించడం మళ్ళీ వాటిని తలకిందులుగా పట్టుకొని పిండేయడం జరుగుతుందట.వాటిని అలా హింసించడమే కాకుండా వాటిని ఒక చెట్టుకి మేకుతో కొట్టి చర్మం వాళ్ళు చేయడం డబ్బులకు అమ్ముకుంటారట.
ఇలాంటి వారి నుంచి తాను ఎన్నో పాములను రక్షించానని సాయి కిరణ్ తెలిపాడు.అతను ఇంటర్వ్యూ చూసిన చాలామంది మీరు సూపర్ సార్, ఎంత గొప్ప మనసుతో వాటి ప్రాణాలను మీరు కాపాడుతున్నారో మేము అర్థం చేసుకోగలం అంటూ కామెంట్లు చేస్తున్నారు.