షాకింగ్ వీడియో: యూఎస్ మహిళను కొరికేసిన సొరచేప.. నీరు ఎర్రగా మారింది..!

టెక్సాస్ రాష్ట్రం, సౌత్ పాద్రే ద్వీపంలో( South Padre Island ) ఫోర్త్ ఆఫ్ జులై వేడుకల సమయంలో సొర చేపలు దాడులు( Shark Attacks ) చేశాయి.దాంతో ఈ వేడుకల్లో పాల్గొన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

 Viral Video Water Turns Red After Us Woman Gets Bitten By Shark Details, Shark A-TeluguStop.com

రెండు గంటల వ్యవధిలో, ఒకే షార్క్ ఐదుగురు వ్యక్తులపై దాడి చేసింది.ఒక మహిళ తీవ్రంగా గాయపడింది, షార్క్ ఆమె కాలులో చిన్న భాగాన్ని కొరికివేసింది.

ఇతర బీచ్‌లో ఉన్నవారు ఆమెను త్వరగా నీటి నుంచి బయటకు లాగారు.ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కూడా షార్క్ దాడికి గురయ్యారు, ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

భయంకరమైన సంఘటనల తర్వాత, అధికారులు షార్క్‌ను గుర్తించి దానిని లోతైన నీటిలోకి తిరిగి పంపించగలిగారు.బాధితురాలి గాయం నుంచి రక్తం వెలువడటంతో బీచ్ నీరు ఎర్రగా మారింది.

దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.ఉదయం 11 గంటల సమయంలో పోలీసులకు మొదటి కాల్ అందింది.

ఈ దాడుల్లో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి, మరో ఇద్దరికి ఘోరంగా గాయపడ్డారు.

కైల్ జడ్ అనే స్థానికుడు ఘటనా స్థలాన్ని న్యూస్ ఛానెల్‌తో వివరించారు. “బీచ్ పెట్రోలింగ్ సిబ్బంది ఆమెను రక్షించింది అప్పటికే ఆమె కాలు బాగా దెబ్బతిని ముక్కలుగా మారింది.చాలా భయంకరంగా ఉంది” అని ఆయన చెప్పారు.

రక్షణ సమయంలో తీసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.దానిలో గాయపడిన స్త్రీని( Injured Woman ) ప్రజలు ఎత్తుకుపోతుండగా, షార్క్ దగ్గరే ఉంది, బహుశా అది మరింత ఆహారం కోసం వెతుకుతోంది.

బాధితురాలి కుమార్తె మాట్లాడుతూ “ఆమె కాలు నుంచి కొంత రక్తం కారుతున్నట్లు చూశాను.షార్క్ ఆమెను ఢీకొట్టింది, దాని ఐదు, ఆరు పళ్లు ఆమె కాలును గీరాయి.గాయాలు లోతుగా లేవు.మేం షార్క్‌ను వాళ్ల దగ్గరే ఉండేవరకు చూడలేదు.అక్కడ నీరు అలలుగా లేదు, సముద్రం ప్రశాంతంగా ఉంది.అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు” అని చెప్పారు.

టెక్సాస్ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో “టెక్సాస్‌లో( Texas ) ఈ స్థాయిలో షార్క్ దాడులు చాలా అరుదు.” అని పేర్కొంది.అగ్నిమాపక దళ అధిపతి జిమ్ పిగ్ దాడి చేసిన షార్క్ రకం గురించి కచ్చితంగా తెలియదని, కానీ దర్యాప్తు చేస్తున్నారని స్పష్టం చేశారు.దాడుల తీవ్రత దృష్ట్యా, లైఫ్‌గార్డ్‌లు ( Lifeguards ) బీచ్‌లో ఉన్న వ్యక్తులకు నీటిలోకి ప్రవేశించవద్దని సలహా ఇవ్వడం ప్రారంభించారు, అయితే జాగ్రత్తగా ఒక అడుగు లోతు నీటిలోకి వెళ్లడానికి అనుమతించారు.

ఘటన జరిగిన వెంటనే, అధికారులు షార్క్‌ను గుర్తించడానికి డ్రోన్లు, బోట్లు, హెలికాప్టర్లను ఉపయోగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube