శేఖర్ కమ్ముల కుబేర సినిమాలో నటించనున్న స్టార్ హీరోయిన్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల( Director Shekhar Kammula )… ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ ను హీరోగా పెట్టి కుబేర( Kubera ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Star Heroine To Act In Shekhar Kammula's Kubera Movie, Shekhar Kammula, Kubera M-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాలో ధనుష్ పోషించే పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందట.

ఆ పాత్రని ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయలేరనే ఆయన్ని తీసుకున్నాం అన్నట్టుగా శేఖర్ కమ్ముల మాట్లాడటం విశేషం… ఇక ఈ సినిమాతో ధనుష్ కి నేషనల్ అవార్డు( National Award ) వస్తుంది అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఇక ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్ర లో నటిస్తున్నాడు.ఇక నాగార్జునకు జోడిగా ఈ సినిమాలో శ్రేయ( Shreya ) కూడా నటించబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.శ్రేయ ఇంతకుముందు శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది.

 Star Heroine To Act In Shekhar Kammula's Kubera Movie, Shekhar Kammula, Kubera M-TeluguStop.com

మరి ఇప్పుడు కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.మరి ఆమె పాత్ర ఏంటి అనేది ఇంకా తెలియదు కానీ మొత్తానికైతే ఆమె ఈ సినిమాలో నటిస్తుందనే విషయం మీద చాలా క్లారిటీ అయితే వచ్చింది… ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ సెటిల్ అయిన తర్వాత ఇప్పటివరకు సినిమాల్లో నటించలేదు.కాబట్టి ఈ సినిమా ద్వారా మరోసారి రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube