వేరుశనగలు.దాదాపు అందరి ఇళ్లలోనూ వీటిని విరివిరిగా వినియోగిస్తుంటారు.
రుచి పరంగానే కాదు వేరుశనగల్లో బోలెడన్ని పోషకాలు సైతం నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే వేరుశెనగలే కాదు వేరుశనగ పాలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.అసలు వేరుశనగ పాల గురించి ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే వెంటనే తాగడం స్టార్ట్ చేస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం వేరుశనగ పాలు ఎలా తయారు చేసుకోవాలి.? అసలు ఈ పాలు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి.?వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వేరుశనగలు వేసి వాటర్ పోసి కనీసం ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
అనంతరం వాటర్ తో వేరుశనగలకు ఉన్న పొట్టును తొలగించుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో పొట్టు తొలగించిన వేరుశనగలు, రెండు కప్పుల వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో వేరుశెనగ పాలను సపరేట్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఈ పాలు దాదాపు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి.
నార్మల్ పాల మాదిరి వేరుశనగ పాలను కూడా వాడుకోవచ్చు.
ఈ వేరుశనగ పాలను డైట్ లో చేర్చుకుంటే గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.
చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా మెరుస్తుంది.శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.
వెయిట్ లాస్ అవుతారు.మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది.
జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు సైతం దూరం అవుతాయి.