బంతితో ఆడుకుంటున్న కుక్క, పంది.. వీడియో చూస్తే ఫిదా..

సాధారణంగా కుక్కలు, ఏనుగులు, పిల్లులు మనుషుల లాగానే ఆటలు ఆడుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటాయి.మనుషులు లేకపోయినా ఇవి సరదాగా ఆటలు ఆడుకోవడానికి ఒక మార్గం కనుగొంటాయి.

 A Dog And A Pig Playing With A Ball, Viral Video, Viral News, Dog, Pig, Playing-TeluguStop.com

మనుషులు పారేసిన బంతులను తీసుకొని ఆడిన జంతువులు కూడా ఉన్నాయి.తాజాగా ఆటలాడుకోవడానికి ఒక పంది కుక్క స్నేహం చేశాయి.

ఇవి రెండు హాయిగా ఆట ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక నల్ల పంది, పొట్టి కుక్క( Dog ) రెండు కలిసి ఫుట్‌బాల్ బంతితో ఆడుతుండటం మనం చూడవచ్చు.పంది మూతితో బంతిని హిట్ చేయగా అది కుక్క వైపు వెళ్ళింది.దానిని కుక్క తిరిగి తన మూతితో పంది వైపు తోసింది.

మళ్లీ పంది దానిని హిట్ చేయగా కుక్క తిరిగి కొట్టేందుకు బంతి వెంట పరిగెత్తడం మనం చూడవచ్చు.నిజానికి కుక్క పంది ఎప్పుడూ స్నేహం చేయవు.కానీ కొన్ని సందర్భాల్లో అవి ఒక దానికి ఒకటి దగ్గరయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాయి.

Buitengebieden ట్విట్టర్( Twitter ) పేజీ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.షేర్ చేసిన కొంత సమయానికి ఈ బ్యూటిఫుల్ వీడియోకి 23 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసి ఎంతో హాయిగా గడుపుతున్న ఈ జంతువులను తిండి కోసం చంపకూడదని నెటిజన్లు అంటున్నారు.

ఈ ప్రపంచంలో జీవించడానికి అందరికీ హక్కు ఉందని, స్వార్థం కోసం మిత్ర జీవులను అన్యాయంగా చంపేయకూడదు అని మరికొందరు పేర్కొన్నారు.ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోలతో న్యూ ఇయర్ ఎంతో హ్యాపీగా అనిపిస్తుందని మరికొందరి పేర్కొన్నారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube