అమెరికాలో భారతీయులు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి తమ దేశానికి వచ్చిన వారు తమను మించి ఎదుగుతుండటంతో కొందరు స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి.తాజాగా భారత సంతతికి చెందిన రాజకీయవేత్త, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన అజయ్ భూటోరియాకు( Ajay Bhutoria ) బెదిరింపులు వచ్చాయి.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్,( Kamala Harris ) డెమొక్రాటిక్ పార్టీకి ఫండ్ రైజర్‌గా అజయ్ వ్యవహరిస్తున్నారు.కౌంటీని వదిలి భారతదేశానికి వెళ్లిపోవాల్సిందిగా గుర్తు తెలియని దుండగుడు మెసేజ్ పెట్టాడు.
అమెరికన్లకు ఏది మంచిదో అదే చేస్తున్నామని అంటున్నారని.కానీ మీరు అమెరికాకు( America ) ఏం చేయడం లేదని, నువ్వు భారతీయుడివి, భారతీయుల గురించే పట్టించుకుంటావ్.అమెరికాలో బిచ్చగాడిగా ఉండటం మానేసి, భారత్‌లో నాయకుడిగా ఎదగండి అని అజయ్ జైన్ భూటోరియాకు ఆదివారం ఈ సందేశం వచ్చింది.గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్( Green Card Backlog ) కోసం పోరాడేందుకు భారత్‌కు తిరిగి వెళ్లాలని ట్రంప్ మద్ధతుదారులు తనను కోరుతున్నారని భూటోరియా ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.
తనకు వచ్చిన సందేశాలను భూటోరియా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు.ఈయన ఆసియా అమెరికన్‌లపై ప్రెసిడెన్షియల్ కమీషన్‌లోని సభ్యుడు
కాగా.భారతీయుల వీసా ఇబ్బందులపై అజయ్ భూటోరియా తీవ్రంగా శ్రమిస్తున్నారు.భారతదేశంలోని యూఎస్ మిషన్ కొత్తగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్‌లను విడుదల చేయడాన్ని ఆయన ఇటీవల స్వాగతించారు.గతంలో తాను సమర్పించిన సిఫారసులలో ఇది ఒకటన్నారు.
వీసా అపాయింట్‌మెంట్‌లో నిరీక్షణ సమయాలను పరిష్కరించడంలో కృషి చేసిన భారత్‌లోని యూఎస్ ఎంబసీకి, ప్రత్యేకించి భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ప్రెసిడెన్షియల్ కమీషన్‌లో సభ్యుడిగా వీసా అపాయింట్‌మెంట్ టైమ్‌లు తగ్గించడంతో పాటు గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌ల తగ్గింపు లక్ష్యంగా భూటోరియా గతంలో పలు సిఫార్సులు చేశారు.