టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్( Varun Tej ) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి.వరుణ్ తేజ్ ను పరాజయాల పరంపర వెంటాడుతోంది.
ఇకపోతే త్వరలోనే వరుణ్ తేజ్ మట్కా( Matka Movie ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే.నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కు ఈ సినిమా రావడం అన్నది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పాలి.
ఇది ఒక విధంగా బెస్ట్ చాన్స్.అన్ని విధాలా ప్రూవ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఏదో రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.కమర్షియల్ లెక్కలు చూసుకుని, మూడు ఫైట్లు, అయిదు పాటలు పెట్టి చుట్టేసిన సినిమా కాదు.
కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించిన సినిమా.దర్శకుడు కరుణ్ కుమార్ కు( Director Karuna Kumar ) ఒక ఐడియాలజీ అంటూ వుంది.
పలాస,( Palasa ) శ్రీదేవి సోడా సెంటర్( Sridevi Soda Center ) సినిమాలు కమర్షియల్ గా ఎంత ఫేర్ చేసాయి.అలాంటి లెక్కలు పక్కన పెడితే క్రిటికల్ గా ప్రశంసలు అందుకున్నాయి.
ఇప్పుడు తీస్తున్న మట్కా కూడా కింద నుంచి పైకి వచ్చిన ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కథే అయినా, దానికి తీసుకున్న నేపథ్యం, పిరియాడిక్ టచ్ ఇలా అన్నీ కలిసి మట్కాను ఒక వైవిధ్యమైన సినిమాగా మార్చాయి.
పైగా వరుణ్ తేజ్ కు నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఇది అని చెప్పాలి.సినిమాలో దాదాపు నాలుగైదు షేడ్స్ వున్నాయి.యంగ్ నుంచి సీనియర్ వరకు అన్ని ఏజ్ ల్లో తన నటన చూపించే అవకాశం వుంది.
కాబట్టి అన్ని విధాలుగా చూసుకుంటే ఈ సినిమా హిట్ కొట్టడానికి స్కోప్ ఉన్న సినిమా అని చెప్పాలి.వరుణ్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.
ఫిజిక్ విషయంలో, లుక్ విషయంలో, డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు.
సినిమా ప్రచారానికి కూడా చాలా ఎక్కవ టైమ్ కేటాయించి, తిరిగాడు.ఓపెన్ గా మాట్లాడాడు.సో ఒక సక్సెస్ ఫుల్ సినిమాకు ఏం కావాలో, అన్ని విధాలుగా, అన్నీ చేసారు.
ఇక మిగిలింది సినిమా ఎలా వచ్చింది అన్నది.సినిమా ఏమాత్రం ఎంగేజింగ్ గా వున్నా, థియేటర్లో సరైన సినిమా లేదు.
కంగువ సినిమా గట్టి పోటీనే.కానీ మట్కా సినిమాకు జానర్ అడ్వాంటేజ్ వుంది.
కానీ ఎన్ని అడ్వాంటేజ్ లు వున్నా, చివరకు ప్రూవ్ కావాల్సింది, సినిమాను నిలబెట్టాల్సింది సినిమానే.మరి ఈ సినిమా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలని మరి.