టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )ఒకటి కాగా ఈ సంస్థ ఒకవైపు సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే నైజాంలో కంగువకు ( Kanguva )భారీ షాక్ తగిలిందని సమాచారం అందుతోంది.
ఆసియన్ సునీల్, మైత్రీ శశి మధ్య నెలకొన్న వివాదం కంగువకు థియేటర్ల విషయంలో సమస్యను సృష్టించిందని చెప్పవచ్చు.
నైజాంలో ఏషియన్ చైన్ లో ఉన్న ఏ థియేటర్ లో కంగువ మూవీ బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
ఏఎంబీ, ఏఏఏ సినిమాస్ లలో సైతం కంగువ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో కంగువ సినిమా కలెక్షన్ల విషయంలో భారీ స్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాల్సి ఉంది.
మైత్రీ నిర్మాతలకు కొత్త సమస్యలు ఎదురవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
నైజాంలో కంగువ పరిస్థితి ఏంటో అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.సూర్య సినిమాకు తమిళనాట సైతం పరిస్థితులు అనుకూలంగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సూర్య కంగువ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.
కంగువ మూవీ దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది.కంగువ సినిమా కథ, కథనం కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.
నైజాంలో ఆధిపత్య పోరు వల్ల పండగల సమయంలో కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.మరోవైపు మట్కా సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కినా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.కంగువ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.కంగువ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కంగువ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.