మరోసారి లేఖలతో తెరపైకి వచ్చారు కాపు ఉద్యమనేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం(Former Minister Mudragada Padmanabham).ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన, బిజెపి(Janasena, BJP) లలో చేరుతారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా చివరకు వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరారు.
ఎన్నికల కు ముందు నుంచీ టీడీపీ కూటమికి(TDP Kutami ) ఓటు వేయవద్దు అంటూ రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ అనేక లేఖలు రాశారు. అలాగే అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలోనూ అనేక అంశాలపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు లేఖలు రాశారు.
ఇంకా ఏపీ ఎన్నికలలో టిడిపి, జనసేన ,బిజెపి, కూటమి అధికారంలోకి రావడంతో ముద్రగడ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తాజాగా మరోసారి లేఖతో ఏపీ ప్రభుత్వం తీరును విమర్శిస్తూ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.
దీంతో పాటు రెడ్ బుక్(Red BOOK) ను ఉద్దేశిస్తూ లేఖలో అనేక ఆరోపణలు చేశారు.
సోషల్ మీడియా కేసులను ప్రధానంగా ప్రస్తావిస్తూ ముద్రగడ (mundragada)లేఖలో పేర్కొన్నారు.ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబును(CM Chandrababu) ఉద్దేశిస్తూ లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ముద్రగడ విమర్శలు చేశారు.
సూపర్ సిక్స్ హామీల అమలు , వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని ముద్రగడ డిమాండ్ చేశారు.అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ లేఖలో ప్రస్తావించారు .
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పలువురు వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్(ysrcp social media activists,) లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో, ముద్రగడ ఈ లేఖను రాశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(CM Chandrababu, Deputy CM Pawan Kalyan) , కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్తులు అనేక అభ్యంతర పోస్టులు పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై సీరియస్ యాక్షన్ కు దిగడంతో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు.