సాధారణంగా కొందరికి మొటిమలు( Acne ) చాలా ఎక్కువగా వస్తుంటాయి.అయితే మూడు నాలుగు రోజులకు ఆ మొటిమలు పోయిన వాటి తాలూకు మచ్చలు మాత్రం ముఖంపై అలానే ఉండిపోతాయి.
ఆ మచ్చలు చాలా అసహ్యంగా కనిపిస్తాయి.అందాన్ని పాడుచేస్తాయి.
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.ఈ క్రమంలోనే మొటిమల తాలూకు మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు మీకు బాగా వర్కోట్ అవుతాయి.
టిప్-1:
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ వేప పొడి,( Neem Powder ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic Turmeric ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు గోరువెచ్చని ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పూతల అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ చిట్కాను కనుక పాటిస్తే ముఖంపై మొటిమల తాలూకు మచ్చలన్నీ మాయమవుతాయి.అదే సమయంలో చర్మం అందంగా ప్రకాశవంతంగా మారుతుంది.
టిప్-2:
ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్,( Almond Oil ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్,( Lemon Juice ) పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు కుంకుమ పువ్వు మరియు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని నాలుగు నిమిషాల పాటు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి ఫేస్ క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.
క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత చర్మాన్ని రెండు నిమిషాల పాటు మసాజ్ కావాలి.నిత్యం ఈ క్రీమ్ ను కనుక వాడితే మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.
చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతుంది.