వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే 2 నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది!

సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.ఆడవారే కాదు మగవారు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటారు.

 Try This Mask For Double Hair Growth Details, Double Hair Growth, Hair Care, Ha-TeluguStop.com

పల్చటి జుట్టు( Thin Hair ) కారణంగా ఎటువంటి హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు.పైగా అట్రాక్టివ్ గా కూడా కనిపించలేరు.

ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది.

వారానికి ఒక్కసారి ఆ మాస్క్ వేసుకుంటే రెండు నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది.మ‌రి ఇంతకీ ఆ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) మరియు గుప్పెడు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు( Fresh Coconut ) వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ మరియు కొబ్బరి ముక్కలు వాటర్ తో సహా వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Aloevera Gel, Double, Coconut, Care, Care Tips, Healthy, Olive Oil, Thick

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Aloevera Gel, Double, Coconut, Care, Care Tips, Healthy, Olive Oil, Thick

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం, చిట్లడం, విరగడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.పల్చటి జుట్టు కొద్ది రోజుల్లోనే దట్టంగా మారుతుంది.

పైగా ఈ మాస్క్ డ్రై హెయిర్ సమస్యను దూరం చేస్తుంది.జుట్టును సహజంగానే సిల్కీగా స్మూత్ గా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube