చికాగోలో సినిమాలో లాంటి ఒక నిజ జీవిత సంఘటన చోటుచేసుకుంది.సినిమాలో హీరో తల్లి (Hero Mother) పక్కనే ఉన్నా కలుసుకోలేకపోతుంటాడు.
చివరికి వారు ఏకమవుతారు.అలాగే కన్నతల్లి పక్కనే ఉన్న ఆమె తన అసలైన తల్లి అని అమెరికన్(American) వ్యక్తి గుర్తించలేకపోయాడు.
చివరికి అతని కథ సుఖాంతం అయ్యింది.తన తల్లి తాను రోజూ వెళ్లే బ్యాకరీ షాపు ఓనరే అని అతను తెలుసుకున్నాడు, ఆమెతో రీ-యూనియన్ అయ్యాడు.
సౌత్ షోర్‌కు చెందిన వామర్ హంటర్ (50)(Wamar Hunter (50) ,South Shore) తనను తన తల్లి దత్తత ఇచ్చేసిందని 35 ఏళ్ల వయసులో తెలుసుకున్నాడు.అప్పటినుంచి అతను, తనకు జన్మనిచ్చిన తల్లి గురించి ఆరా తీస్తూనే ఉన్నాడు.
2022లో డీఎన్ఏ(DNA) టెస్ట్ చేయించుకొని తన బంధువులను వెతకడం మొదలుపెట్టాడు.కాలిఫోర్నియాకు చెందిన నిపుణురాలు గబ్రియెలా వార్గాస్ అతనికి సహాయం చేసింది.
వార్గాస్ అతని కుటుంబ వృక్షాన్ని తయారు చేసి, లెనోర్ లిండ్సే అనే 67 ఏళ్ల మహిళతో DNA మ్యాచ్ అయిందని కనుగొంది.ఆశ్చర్యకరంగా ఆమే చికాగోలో ‘గివ్ మీ సమ్ సుగర్’ (Give Me Some Sugar)అనే బేకరీ యజమాని.
వామర్‌కు ఆ బేకరీ ఎంతో ఇష్టం.తన కన్న తల్లే తన ఫేవరెట్ బేకరీ ఓనర్ అని తెలుసుకొని అతను ఆశ్చర్యపోయాడు.
ఈ స్వీట్ సర్‌ప్రైజ్ తనకి ఎంతో సంతోషాన్ని కలిగించింది.లిండ్సే, వామర్ హంటర్(Lindsay, Warmer Hunter) మధ్య ఉన్న బంధాన్ని నిర్ధారించిన తర్వాత, లిండ్సేకు హంటర్ నంబర్ ఇచ్చింది వార్గాస్.
ఆ సమయంలో లిండ్సే రొమ్ము క్యాన్సర్(Breast cancer) శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నారు.కీమోథెరపీకి సిద్ధమవుతున్నప్పటికీ, వెంటనే అతన్ని ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది.బేకరీ నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు హంటర్ చాలా ఆశ్చర్యపోయాడు.“గివ్ మీ సమ్ సుగర్’ ఓనర్ ఎందుకు నాకు ఫోన్ చేస్తుంది?” అని ఆలోచించాడు.ఫోన్ ఎత్తగా, లిండ్సే, “వామర్ హంటరే మాట్లాడుతున్నాడా?” అని అడిగింది.కొద్ది సేపటికి ఇద్దరికీ నిజం తెలిసింది.
అంతే ఫోన్‌లో ఇద్దరూ కెవ్వుమని కేక పెట్టేసారు.
1974లో 17 ఏళ్ల వయసున్నప్పుడు లిండ్సే తన కుమారుడిని దత్తతకు ఇచ్చేసింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె అలా చేసింది.నవమాసాలు మోసి కన్న తన బిడ్డను చివరిసారిగా చూడాల్సి వచ్చినప్పుడు ఆమె కంటతడి పెట్టుకుంది.
మళ్లీ అతడిని కలుసుకుంటానని ఆమె కలలో కూడా ఊహించలేదు కానీ కుమారుడు ప్రయత్నాలను వదులుకోకుండా తన తల్లి కోసం వెతుకుతూ చివరికి ఆమెను కలిశాడు.ఇప్పుడు బేకరీలో వీరిద్దరూ పార్ట్‌నర్స్ అయ్యారు.
తన కుమారులకు ఆ బేకరీ షాపును వారసత్వంగా ఇవ్వాలని హంటర్ భావిస్తున్నాడు.మొత్తం మీద ఈ స్టోరీ యూఎస్ లో చాలామంది హృదయాలను తాకుతోంది.