టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా నాగచైతన్య ( Nagachaitanya ) పేరు మారుమోగుతుంది.ఇలా తరచు నాగచైతన్య వార్తలలో నిలవడానికి కారణం లేకపోలేదు.
ఈయన సమంతని( Samantha ) ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని మూడేళ్ల తర్వాత విడాకులు ఇచ్చారు ఇలా విడాకులు తీసుకున్న నాగచైతన్య తిరిగి మరొకటి శోభిత( Sobhita ) ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో నిత్యం వార్తలలో నిలుస్తున్నారు.ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న నాగచైతన్య త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే వీరి పెళ్లి ఏర్పాట్లు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయని సమాచారం.

డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్య శోభిత పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది.ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకుంటున్న తరుణంలో సమంత నాగచైతన్య విడాకులకు శోభిత కారణమని మరొక వార్త వెలుగులోకి వచ్చింది.శోభిత కారణంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అందుకే విడాకులు తీసుకొని విడిపోయారంటూ వార్తలు హల్చల్ చేశాయి అయితే తాజాగా రానా ( Rana ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షో( The Rana Daggubati Talk Show ) అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది.

ఈ కార్యక్రమం ఈనెల 23వ తేదీ నుంచి ప్రసారం కానుంది.తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని తెలుస్తుంది.ఇక నాగచైతన్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనగా నాగచైతన్యను రానా ఒకటే ప్రశ్న వేశారు.నీ కుటుంబం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అంటూ రానా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చైతన్య సమాధానం చెబుతూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.దీంతో నాగచైతన్యకు పిల్లలు అంటే చాలా ఇష్టమని పిల్లల విషయంలోనే సమంత నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయని అందుకే విడాకులు తీసుకున్నారంటూ మరో చర్చ జరుగుతుంది.
అయితే ఇటీవల సమంత కూడా తాను అమ్మను కావాలని ఉంది అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.








