ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) బాలయ్య అన్ స్టాపబుల్( Un Stoppable ) కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ఇటీవల ప్రసారమైన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఎన్నో విషయాలను బయటపెట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ కొంతమంది టాలీవుడ్ హీరోల ఫోటోలు చూపించి వారి గురించి బన్నీని ప్రశ్నిస్తూ ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ఫోటోని కూడా ఈ కార్యక్రమంలో చూపించారు.
నిజానికి ప్రభాస్ అల్లు అర్జున్ మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇండస్ట్రీలో అందరూ హీరోలతో ప్రభాస్ చాలా మంచిగా ఉంటారు.కానీ గోపీచంద్ బన్నీతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతానని ఇక బాహుబలి సినిమా సమయం నుంచి రానా కూడా మంచి స్నేహితుడుగా మారిపోయాడు అంటూ స్వయంగా ప్రభాస్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు.ఈ క్రమంలోనే ప్రభాస్ ఫోటోని చూపించడంతో అల్లు అర్జున్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ గురించి నేనెప్పుడూ ఒకే విషయమే చెబుతాను ఆయన ఆరడుగుల బంగారం అని ప్రశంసలు కురిపించారు.

ఇక ప్రభాస్ తనకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు అంటూ అల్లు అర్జున్ అసలు విషయం బయట పెట్టారు.నేను ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ రోజు తప్పనిసరిగా ఇంట్లో క్రిస్మస్ ట్రీ (Christmas Tree) ఏర్పాటు చేస్తాను.ఆ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఒక రోజు యూరప్ నుంచి నా కోసం క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేయడానికి ఏమేమి కావాలి అన్ని కూడా తీసుకొచ్చి గిఫ్ట్ గా పంపించారు.అదేంటి క్రిస్మస్ ట్రీ తెచ్చావని అడగడంతో ప్రతి ఏడాది నువ్వు క్రిస్మస్ ట్రీ పెడతావట కదా అందుకోసమే తెచ్చానని నాకు సమాధానం చెప్పారు.
ఇక నేను కూడా ప్రభాస్ కోసం ఒక చిన్న మొక్కను పంపించాను అది ఇప్పుడు పెరిగి పెద్దదైందని బన్నీ తనకు ప్రభాస్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా బయట పెట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







