అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2 ( Pushpa 2 ) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ ( Balakrishna ) హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ (Un Stoppable) కార్యక్రమానికి వచ్చారు.ఈ కార్యక్రమంలో వీరి ఎపిసోడ్ ఇటీవల ప్రసారం కాక అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన ఫ్యామిలీ విషయాలను కూడా ఈ కార్యక్రమంలో అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తో పాటు తన తల్లి నిర్మల కూడా హాజరైన సంగతి తెలిసిందే.ఇక బాలకృష్ణ అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తూ పెళ్లికి ముందు ఎవరితోనైనా డేటింగ్ చేశారా అనే ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు బన్ని సమాధానం చెబుతూ… తప్పకుండా ఈ షో మా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు.నేను వారికి ఒకే విషయం చెప్పాను.పెళ్లికి ముందు నేను మీ అమ్మని ప్రేమించాను ఆమెని పెళ్లి చేసుకున్నానని నా కొడుకుకి చెప్పాను.అయాన్ ( Ayaan ) యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) లాంటివాడు.
తండ్రి కోసం ఏమైనా చేస్తాడు కానీ తల్లి విషయంలో ఏదైనా జరిగితే నన్ను కూడా వదలడు అంటూ ఈ సందర్భంగా తన కొడుకు గురించి బన్నీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక పెళ్లికి ముందే నేను నాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని స్నేహ రెడ్డికి ( Sneha Reddy ) చెప్పినట్లు తెలియచేశారు.ఆమె దగ్గర నేను ఎలాంటి విషయాలను దాచి పెట్టలేదు.గతంలో జరిగిన కొన్ని విషయాలకు పెళ్లి అనేది ఒక రీసెట్ బటన్ లాంటిది అందువల్ల నాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని స్నేహ రెడ్డికి తెలియజేశానని ఈ సందర్భంగా అల్లు అర్జున్ వెల్లడించారు.
ఇక స్నేహ రెడ్డి తన జీవితంలోకి వచ్చిన తర్వాత తనలో ఎన్నో విషయాలలో మార్పులు కూడా వచ్చాయని ఈ సందర్భంగా ఈయన తన భార్య గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకున్నారు.