హిందూమతంలో ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ( Suryanarayana ) ఆరోగ్య ప్రధాతగా భావించి పూజిస్తారు అయితే సూర్యుడు మనకు ప్రతిరోజు కనిపించే దైవం అని చెప్పాలి అయితే ఎవరిపై సూర్యుడి అనుగ్రహం ఉంటే వారికి ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సౌభాగ్యం లభిస్తుంది.శ్రీకృష్ణుడు, కన్నయ్య కుమారుడైన సాంబ నుండి శ్రీరాముడు, రావణుడు వరకు సూర్యభగవానున్ని పూజిస్తూనే ఉన్నారు.
అయితే సూర్యభగవానుడిని గ్రహాలకు రాజుగా కూడా పరిగణిస్తారు.ఇక ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచాక సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే తమ జీవితం మొత్తం ఆనందంతో నిండిపోతుంది.
అలాగే సూర్యుడిని ఆరాధించడం వలన కలిగే ఎన్నో ప్రయోజనాల గురించి గ్రంథాలలో కూడా పేర్కొనడం జరిగింది.

అయితే ప్రతిరోజు సూర్యుడిని ఆరాధించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.ఉదయాన్నే స్నానం చేసి ఆ తర్వాత సూర్యభగవానుడుకు ( Surya Bhagawan ) అర్ఘ్యం సమర్పించాలి.ఇక సూర్యుడిని ఆరాధించే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
వీటిని పాటించడం వలన అదృష్టం అందలం ఎక్కిస్తుందని విశ్వాసం.అయితే ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య భగవానుడి అనుగ్రహం ఉండాలంటే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.అలాగే రాగి పాత్రలో నీటిని, అక్షతలు, ఎర్రటి పువ్వులు, కుంకుమ వేసి ఉదయించే సూర్యునికి ఆ నీటిని సమర్పించాలి.
సూర్యునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు “ఓం ఘృణి సూర్యాయ నమః” అని జపించాలి.

అలాగే సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఆ నీటిని ఏ మొక్కకైనా అందించవచ్చు.ఇక ఏ కోరికైనా తీరాలనుకుంటే 12, 30 ఆదివారాలు లేదా 52 సోమవారాలు సూర్య భగవానుడిని పూజించాలి.అలాగే ఉపవాస దీక్ష ( Fasting ) కూడా పాటించాలి.
దీని వలన సూర్య భగవానుని అనుగ్రహం లభించి ఆ కోరికలు తీరిపోతాయి.ఇక ప్రతిరోజు ఆదివారం నెయ్యి,రాగి, బెల్లం దానం చేయడం కూడా మంచి మార్గం.
ఇలాంటి దానాలు చేయడం వలన భాస్కరుడు సంతోషించి తన ఆశీస్సులను కురిపిస్తాడు.ఇక ఆదివారం నాడు ఎర్రటి ఆవులకు గోధుమలు తినిపించడం లాంటివి చేయాలి.
ఇలా ఈ నియమాలు పాటిస్తే శత్రువులపై విజయం సాధించవచ్చు.
DEVOTIONAL