సాధారణంగా రుద్రాక్షలను ధరించడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఆ రుద్రాక్షలను ఎందుకు ధరిస్తారు? అవి ధరించడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఎటువంటి రుద్రాక్షలు ధరించాలి? అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు.ప్రస్తుతం రుద్రాక్షలను కూడా అలంకరణ వస్తువులుగా ధరిస్తున్నారు.కానీ రుద్రాక్షలు ఎంతో పరమ పవిత్రమైనవి.రుద్రాక్షలను సాక్షాత్తు ఆ శివుని అంశంగా భావిస్తారు.రుద్రాక్షలను శివుడి కన్నీటి నుంచి వచ్చినవి గా చెబుతారు.
శివుడు మూడు పురములను భస్మం చేసినపుడు అక్కడ మరణించిన వారిని చూసి ఎంతో విచారిస్తాడు.ఆ విధంగా శివుడు బాధ పడినప్పుడు అతని కంటిలో నుంచి వచ్చిన కన్నీరు భూమిపై పడి ఆ కన్నీరు చెట్లుగా వస్తాయి.
ఆ చెట్ల నుంచి రుద్రాక్షలు వచ్చాయనేది మన పురాణాలు చెబుతున్నాయి.ఇంతటి పవిత్రమైన రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
రుద్రాక్షలలో కూడా మనకు చాలా రకాలు లభిస్తాయి.వీటిలో ఉసిరిక కాయంత పరిమాణమున్నవి రుద్రాక్షలు ధరించడం ఎంతో శ్రేష్టం.రేగుపండు ఆకారంలో ఉన్న రుద్రాక్షలను మధ్యరకం రుద్రాక్షలుగా పిలుస్తారు.
శనగ గింజ పరిమాణంలో ఉన్న రుద్రాక్షలను అధమమైనవిగా భావిస్తారు.కాబట్టి రుద్రాక్షలను ధరించే వారు వాటి పరిమాణమును బట్టి ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
అదేవిధంగా రుద్రాక్షలలో పరిమాణాలు ఉన్నట్టే రంగులు కూడా ఉంటాయి.ఎక్కువగా నలుపు, తెలుపు, తేనె రంగు రుద్రాక్షలు కనిపిస్తుంటాయి.
వీటిలో తేనె రంగు కలిగిన రుద్రాక్షలు చాలా శ్రేష్టమైనవి.
ఈ రుద్రాక్షలను ధరించేటప్పుడు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి.
ఏవైనా విరిగిపోయిన, పురుగులు పట్టిన, సరైన రూపంలో లేని రుద్రాక్షలను అసలు ధరించకూడదు.రుద్రాక్షలను ధరించడానికి ఎలాంటి కులమతాలు తేడా లేకుండా అన్ని కులాలకు చెందిన వారు ధరించవచ్చు.
అయితే రుద్రాక్షలను సంభోగ సమయంలో ధరించకూడదు.ఒకవేళ మర్చిపోయి ధరించినప్పటికి తరువాత ఆ రుద్రాక్షలను ఆవుపాలతో శుద్ధిచేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదివి రుద్రాక్షను ధరించాలి.
ప్రతి ఏటా శివరాత్రి రోజు రుద్రాక్షకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం మంచిది.మాంసాహారం, మద్యపానం సేవించేవారు రుద్రాక్షలను ధరించకూడదు.
అదేవిధంగా ఎవరెవరు జన్మ నక్షత్రాలను బట్టి రుద్రాక్షలు ధరించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL