అంతిమ సంస్కారంలో మొలతాడు కూడా ఉండకూడదా.. ఎందుకు?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనిషి మరణించిన తర్వాత మొలతాడు కూడా తెంపేసిన తర్వాతే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.భూమిలో పూడ్చి పెట్టినా.

 What Is The Reason Behind Should Not There Molathadu In Funeral , Anthima Samsk-TeluguStop.com

ఖననం చేసినా మొలతాడు కచ్చితంగా తెంపుతారు.మనిషి అమ్మ కడుపులోంచి ఎలాగైతే బయటకు వస్తాడో అలాగే చేసి సంస్కారం చేస్తారు.

మనిషి దిగంబరంగా ఈ భూమి మీదకు వస్తాడు.దిగంబరంగానే భూమిని వదిలి వెళతాడు.

దేహాన్ని విడిచిన జీవుడిని మెక్షానికి నడిపించేది ధర్మనిష్ఠ సత్యదీక్ష ఈ రెండు మాత్రమే.

మనిషి బతికున్నంత కాలం పెళ్లాం, బిడ్డల కోసం అన్యాయం అక్రమాలు చేసి, ఎందరినో మోసగించి ధనం సంపాదించి మరణించిన ఆ వ్యక్తిని చూడు.

ఈ శవాన్ని చూసైనా తెలివి తెచ్చుకో ఓ మనిషీ అంటూ చెప్పడానికే ఇలా చేస్తారు.అంతే కాకుండా భార్య వాకిలి దాకా, కొడుకు కాటి దాకా మాత్రమే వచ్చారు.

అంతకు మించి నీకోసం ఎవరూ రారని చెప్పడానికి ఇలా చేస్తారు.అయితే జీవం లేని దేహం మట్టి కాబోయే ముందు కట్టుబట్టలే కాదు, మొలతాడు కూడా మిగల్చడం లేదు.

చచ్చిన వీడిని చూచైనా బ్రతికున్న వారిని బుద్ధి తెచ్చుకోండి అని అన్యాపదేశంగా చెప్పడమే దీని ఉద్దేశం.కానీ ఎన్ని చెప్పినా బంధాలు, బాంధవ్యాల కోసం మనం ఎన్నో నీచాలు చేస్తూనే ఉంటాం.

సత్యంగా బతికినా పది మందికి సాయపడం.కానీ పుట్టిన ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకసారి కచ్చితంగా మరణిస్తారు.

కాబట్టి ఇకనైనా పరులను మోసం చేయకుండా.పది మందికి సాయం చేస్తూ బతకండి.

మనుషులను బతికించండి.మీరు పోయాక మీరు చేసిన సేవ మాత్రమే మిమ్మల్ని బతికిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube