1.పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది.
2.అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన
తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలంటూ రాష్ట్రంగా కలెక్టరేట్ల వద్ద దీక్షకు దిగారు.
3.కేతిరెడ్డికి జేసి సవాల్

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు.మీ కుటుంబం ఎలా బతికిందో నేను చెబుతాను చెప్పుతో కొడుదువు రా అంటూ సవాల్ చేశారు.
4.రైతుల ఆందోళన
గుంటూరు ఛానల్ పొడిగించాలంటూ గుంటూరు జిల్లా పెదనందిపాడు వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.దీంతో గుంటూరు – పరుచూరు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
5.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పడుతుంది.
6.పలు రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు.మరికొన్నిటిని దారి మళ్లించినట్లు వాల్తేరు సీనియర్ డిసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
7.పెండింగ్ బిల్లుల అంశంపై తెలంగాణ రాజ్ భవన్ క్లారిటీ

పెండింగ్ బిల్లుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ వివాదం ఏర్పడింది.తాజాగా ఈ పెండింగ్ బిల్లుల అంశంపై రాజ్ భవన్ వివరణ ఇచ్చింది.గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని స్పష్టం చేసింది.
8.జూపల్లి, భట్టి భేటీ
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క భేటీ అయ్యారు.జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీకి, రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క అన్నారు.
9.ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ ప్రమాదం పై ఉన్నత స్థాయి కమిటీ విచారణ

ఫలుక్ నామా ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది.
10.మంత్రి హరీష్ రావు కామెంట్స్
ఐటీ సేవలు విస్తరణకు పఠాన్ చెరువు కేంద్రం కాబోతుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు.
11.ఎంపీ అరవింద్ కు వై కేటగిరి భద్రత

నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రత కల్పించింది.
12.రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు
రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.
13.హెచ్చరిక స్థాయికి యమునా నది నీటిమట్టం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.దీంతో నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరుకుంది.ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద నది నీటిమట్టం 204.36 మీటర్లకు చేరుకుంది.దీనిపై అప్రమత్తమైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
14.45 రోజుల్లో అసెంబ్లీ రద్దు అవుతుంది
మరో 45 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
15. ఢిల్లీ డిప్యూటీ సీఎంకు బెయిల్ పొడగింపు

ఢిల్లీ మాజీ సీఎం సత్యేంద్ర జైన్ కు మంజూరు చేసిన మభ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు పొడిగించింది.
16.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం
వాలంటీర్లను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు.
17.పవన్ కళ్యాణ్ కు మిథున్ రెడ్డి సవాల్

ఉభయగోదావరి జిల్లాలో వైసిపి కోఆర్డినేటర్ ఎంపీ మిధున్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు సవాల్ చేశారు .వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న పవన్ తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటించగలరా అని పవన్ కు సవాల్ విసిరారు.
18. కడప జిల్లాలో జగన్ పర్యటన
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నేడు కడపలో మూడో రోజు పర్యటించారు.
19.కాంగ్రెస్ గెలిస్తే సీతక్క సీఎం

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీతక్క ను కూడా ముఖ్యమంత్రిని చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
20.జగ్గారెడ్డి కామెంట్స్
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి వెయ్యి కోట్లు అవసరమని, దీనిపై సీఎం కేసీఆర్ లేఖ రాస్తానని జగ్గారెడ్డి అన్నారు.







